28, ఫిబ్రవరి 2011, సోమవారం

SUZY(The Will Power Lady)




చూసారా అండి అందమైన నవ్వు.ఇమెనే సుజీ .........సుజాత ...ఎంత అందమైన ముఖము .అందుకేనేమో మన .పిలోనే అందమైన,తెలివైన,చలాకి యాంకర్ అయ్యింది..టీ.వి 9 చూసే ప్రేక్షకులకు సుపరిచితమే అయిన నేను ఆమెనుచూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మీ అందరికి తెలియాలి అని వ్రాస్తున్న టపా .
ఆమె ఆదిలాబాద్ జిల్లా లోని బెల్లం పల్లి లో పుట్టింది..కృష్ణ గారు,కమల తన తల్లి తండ్రులు .చదువులో ఫస్ట్.చిన్నతనము నుంచే చాల చలాకీగా పెరిగిన సుజికి ఇంటర్ తరువాత చదవబుద్ది కాలేదు.క్రియేటివ్ రంగము అంటే బాగా ఇష్టమున్న సుజీ హైదరాబాదు వచ్చి ఫోటోగ్రఫి నేర్చుకుంది.తనకు అంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని కోరుకునే వ్యక్తి సుజీ.దాని కోసం తను పడ్డ తపన చూస్తే మనము ఆశ్చర్యపోతాము....తను మెరుగైన శిక్షణ పొంది..ఒక ఫోటో స్టూడియో పెట్టి చాల పేరు తెచ్చుకుంది.
అలాంటి పుత్తడి బొమ్మ2001 సంవత్సరంలో చదువుకోవటానికి విదేశాలకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వీసా కోసంఅప్లయ్ చేసుకుంది...కొన్ని రోజుల్లో విదేశాలకి వెళుతుంది అనగా వాళ్ళ స్నేహితులతో కలిసి షిర్డీ వెళ్లి బాబా నిదర్సిన్చుకుందాం అని అనుకుంది.కాని.............?
కానీ షిర్డీ వెళుతుండగా దారిలో వీరి కారుని ఎదురుగా వస్తున్న లారి డి కొట్టటంతో పెద్ద విషాదకరమైన ప్రమాదంజరిగింది.సుజికి వెన్నుపూసకి బలంగా దెబ్బ తగిలింది....4 నెలలు తను హాస్పిటల్లో బెడ్ పైన ఉంది.అంతే దానితో తనజీవితం తారుమారు అయ్యింది.భుజాల నుంచి కాళ్ళ వరకు తన శరీరం చచ్చు పడిపోయింది.తనకి తానుగా కనీసం నీళ్ళు కూడా తగలేను...అనే నిజం తెలియటానికి తనకి 6 నెలలు పట్టింది. కాని యెనలేని ఆత్మవిశ్వాసం కలిగిన సుజికిమాత్రం ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగింది.తను పోసిటివ్ థింకింగ్ ని ఇంకా ఎక్కువ చేసుకుంది.నేను ఎందుకు అందరిలాఉండలేను అని తనకి తనే ధైర్యం తెచ్చుకుని యోగ,మేడిటేషన్ చేసేది..ఫిజియోతేరఫి తీసుకుంది...కొంచెం మెరుగైన తరువాత నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనే నిర్ణయానికి వచ్చి ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేసింది...ఎంతో మందికి ఉపాధి కలిపిస్తోంది.అల ఉంటున్న తనకు 2004 లో ఇంకో సంఘటన ..వాళ్ళ నాన్నగారు పోయారు.అప్పటికే కష్టాలను తనకు అనుకూలంగా మర్చుకోకలిగిన సుజీ "శ్రద్ధ" అనే అనాధసరనాలయం నిర్మించింది.కొంతమంది అనాధలకు ఆశ్రయం కల్పించింది.తనలాగా వెన్నుపూస గాయపడిన వారి కోసం తను వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరిగేల చేస్తోంది.
తను ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది..ఇక్కడ ఒక విషయం అన్ని అవయవాలు చక్కగా పని చేస్తున్న మనము ఏమిసాధిస్తున్నాము(ముఖ్యముగా నన్ను నేను తిట్టుకున్తున్నాను)..నేను ఏమి సాధించలేకపోయాను అనే సిగ్గు నాలో చాలవుంది.ఇంకా నేను కూడా నా ఆసేయాలని సాధించాలి....ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న ఒక్క అమ్మాయి నాకు చాలు అనిపిస్తోంది. మీరేమి అంటారు?
సరే తన విషయానికి వెళదాం.అలా జీవితాన్ని గెలుచుకువస్తున్న సుజికి నవీన యంగ్ ఉమన్ అచీవర్ అవార్డు వచ్చిన సందర్భం లో టీ.వి. 9 రవి ప్రకాష్ కళ్ళలో పడింది.ఇంకా ఆయనకు తనని ఎలాగైనా యాంకర్ని చేయాలి అని ఆలోచన వచ్చింది.దానికి రవి ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.కేవలం మీ మూలంగా నాకు ఇంతటి ఉన్నతమైన వ్యక్తి గురించి తెలిసింది.
తన తెలివితేటలతో...చాల చేలాకిగా ఇంటర్ వ్యూస్ చేస్తూ తనదైన శైలిలో మొదలుపెట్టిన సుజీ.........కి నా అభినందనలు... ఇంకా తన గురించి యేమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
నిజంగా ఇన్ని కష్టాలని తట్టుకుని........ధైర్యం గా ముందుకు సాగిపోతున్న సుజీ....అంటే నాకు చాల ఇష్టం......తనగురించి రాస్తున్నందుకు నాకే గర్వంగా ఉంది.
నిజం లవ్ యు సుజీ.నాకు చాల ఆనందంగా ఉంది.ఒక్కసారి నిన్ను కలవాలి అనే కోరిక తీరుతుందో లేదో తెలియదుకాని...కలిస్తే నేను నీతో చాల మాట్లాడాలి.
ఇంకా ఎంత చెప్పిన చాలదండి తన గురించి.
సుజీ అంటే ఒక చిరునవ్వు. నవ్వు చాలు మన బాధలు పోగొట్టటానికి.
ఉంటాను.......... మీ అంజలి.

3 కామెంట్‌లు:

  1. I have seen suzy show in Tv-9. She is really very inspiring. Thanks for introducing her to everyone.

    రిప్లయితొలగించండి
  2. Good article sobha, Suzy is really great. Andaru Suzy ni choosi nerchukovalsindi entho kontha untundi. Nee blog dvara ame gurunchi andariki teliyacheppalani ankovadam manchi udhesham.. Keep writting stuff like this.

    రిప్లయితొలగించండి
  3. Chala Chakkaga Suzy gurinchi chepparu Shobha. Tanu nizanga manaki spoorthi pradata. Athma sthairyanni tanu kolupokunda , chakkaga naluguriki vupadhi kaligistondi. Hats off ! Ivala womens day andi..Ee sandharbhanga mee blog chuusi , Suzy gurinchi telusukunnanu. Marrinni ilanti vishayalanu maaku mee blog dwara andichandi.
    Vaidehi

    రిప్లయితొలగించండి