27, ఫిబ్రవరి 2011, ఆదివారం

క్రికెట్ పిచ్ఛి

హు .......ఏమిటో ఆదివారం టీ.వీ ని చూడటంతో గడిచిపోయింది మా ఆయనకు .
సహజంగా అంతే నేమో అందరి ఇళ్ళలో ..................సరే నాకేమో బోర్ కొట్టి కాసేపు నా బండి మీద తిరిగివద్దాం అనిబయటకి వెళితే ....ఎప్పుడు కళకళలాడుతూ ఉండే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.అప్పుడు అని పిచ్చింది క్రికెట్ పిచ్చి ఉన్నజనాలు ఇంతమంది ఉన్నారా అని.
హమ్మో ఇలా రాస్తుంటే అందరు నన్ను కొడతారేమో...కేవలం క్రికెట్ మీద అంత ఇంటరెస్ట్ లేని వాళ్లకు మాత్రమే ఇదివర్తిస్తుంది.
నాకు కొన్ని అర్థం కావటం లేదండి
౧.క్రికెట్ చూడటం మూలంగా మనకేమి వస్తుంది?
౨.క్రికెట్ కోసం ఖర్చు పీట్టే డబ్బుని వాళ్ళు ఇతర కార్యక్రమాలు ..అంటే..మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించటం లోఉపయోగిస్తే బావుంటుంది కదా?
౩.యేవో రరకాల పేర్లతో ఎప్పుడు క్రికెట్ వస్తూనే వుంది ఈ మధ్య.అంత ఎందుకు.?
౪.పైగా అదేంటో నండి కరెక్టు గ ఇది పిల్లల పరీక్షల సమయం.ఇంటర్ వాళ్ళకి ప్రేఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి.ఈసమయంలో ఈ అట ఆడటం అవసరమా?వాళ్ళు క్రేజ్ తో ఈ ఆట చూస్తూ ఉంటారు.పైగా చదువుకోమంటే వాళ్ళకికోపము.ఇవన్ని మనల్నే దెబ్బ తీస్తున్నాయి...అవునా?
౫.హోటలుకు వెళ్లి సరదాగా భర్త పిల్లలతో తిందాము అనుకుంటే అక్కడ కూడా పెద్ద పెద్ద టీ.వీ లు...ఇంకేమి ఆనందం
మనకి?
౬.ఆట చూడటం ...రాత్రి ఆలస్యంగా పడుకోవటం .......ఉదయము ఆలస్యముగా లేవటం.. ఆరోగ్యం నాశనం?
౭.ఏమి తిండి పెడుతున్నామో కూడా సరిగా చూడకుండా తినేయటం.?


నాకెంతో నండి ఈ ఆటలు అంటే విసుకు.అవి చూడటం వల్ల ఏమి వస్తుందో కాని..సహజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకిమాత్రం తల నొప్పి చికాకు వస్తాయి. కాదంటారా.

ఏమో నా అభిప్రాయం చెప్పాను.
తప్పు అనుకునే వాళ్ళు నన్ను క్షమించండి...


ఉంటాను...........మీ అంజలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి