12, మార్చి 2009, గురువారం

మంచి మనిషిగా ప్రవర్తిద్దాం !!!--ఒకటవ భాగము.

ఏమిటండి వింతగా వుందా
ఒక్కసారి నాకు ఆలోచన వచ్చింది అండి...ఏమిటి మనము ఎంతకాలం బతక గలము ? మన చేతులలో ఉందా మన బతుకు?అని...అందుకని ఈ టపారాయటం మొదలు పెట్టాను.
౧.చిన్నప్పటి నుంచి అనేకరకాల టెన్షన్స్ ...పిల్లలు పుట్టేటప్పుడు టెన్షన్, పుట్టక పెంచటం ఎలా అనే టెన్షన్,స్కూలుకు వెళ్ళేటప్పుడు టెన్షన్, కాలేజీకి వెళ్ళేటప్పుడు టెన్షన్,పెళ్లి అప్పుడు టెన్షన్,పెళ్లి తరువాత జీవితం టెన్షన్,మల్లి పిల్లలు పుట్టేటప్పుడు,,,ఇలా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది...
౨.టెన్షన్స్ మాత్రం రాను రాను ఎక్కువ అవుతాయి కాని,,,,తగ్గట్లేదు..ఈ టెన్షన్స్ లో కూడా కొన్ని theevramainavi ,కొన్ని మములువి,చాల రకాలు ఉన్నాయి అండి. వాటిల్లో కొన్ని ముఖ్యమ్గా రాద్దాము అనుకుంటున్నాను.
౩.స్కూలుకి వెళ్ళిన పిల్లలు ,కాలేజీ కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచేవరకు టెన్షన్,ఉద్యోగానికి వెళ్ళిన భర్త ఇంటికి వచేవరకు టెన్షన్,....చివరికి ఎలా తయారు అయింది అంటే సరదాకి సినిమాకి ,పార్క్ కి వెళ్ళాలన్న కూడా భయమ్గా తయారు అయింది...బయట.ఇలాగ పరిస్థితులు బయట వుంటే...ఇంట్లో మనము ఎలా ఉంటున్నమన్డి.


౪.ఇంట్లో కూడా ఒకల్లంటే ఒకళ్ళకి పడదు.పొగరు,గర్వం,అహంకారం,నా మాట చెల్లలి అంటే నా మాట చెల్లాలి, పవురుశాలు ,,,,అబ్బో చాల ఉన్నాయి....ఇలా రాసుకుంటూ పోతే.




౫.ఒక్క సారి మన జీవితాల్లోకి మనమే తొంగి చూసుకుందాము..మనము ఏమిటి అనేది...ఒక్కసారి మనము మన చెత్త జీవితాన్ని.....మార్చుకుందాము.ఎందుకండీ.....గొడవలు?హాయిగా అందరమూ కలిసి మెలిసి ఉంటె మన ఆరోగ్యము బావుంటుంది,మనసుకు ప్రశాంతముగా ఉంటుంది...


ఈ రోజు పిల్లల విషయం మీద టపా రాస్తున్నాను...రేపు ఇంకొక విషయం మీద రాస్తాను.
గమనిక: కేవలం ఇవి నా ఆలోచనలు మాత్రమె.తప్పులుంటే క్షమించండి.ఎవరిని బాధపెత్తతానికి కాదు.


౬...ఇంతెందుకు స్కూలుకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్టు రంక్ తెచుకోవాలి అంటే ఎలా?రాంక్ రాకపోతే ఇంట్లో కొట్టటం.ఇంట్లో కొడతారు అనే భయామ్తో వాళ్ళు అబద్దం చెప్పటం.....ఇలా ఇలా మన పిల్లలు మనల్నే చూసి భయపడుతుంటే ఎలాగా అండి?మన మూలంగానే వాళ్లకు క్రూరత్వం,అబద్దాలు చెప్పే మనస్తత్వం,వస్తున్నాయి...అంతే కాదు బయట పిచి పనులకు అలవాటు పడుతున్నారు,,,ఎక్కడో అక్కడ వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు....అల అల పెరిగి కొంత మంది మంచి వాళ్ళు అవుతున్నారు,కొంతమంది చెడ్డ వాళ్ళు అవుతున్నారు.ఇంకా లోతుగా ఆలోచించుకుంటూ పోతే ఈ రావుడీలు,గూండాలు ,టెర్రరిస్టులు...వీళ్ళు అంత కూడా ఇలా తయారు ఐన వాల్లెనేమో అనిపిస్తుంది...చిన్నప్పటినుంచి...వాళ్ళ ఆలోచనలను అణిచి వేసి...బలవంతంగా మనకు నచినట్టు పెంచితే వాళ్ళు ఎలా హ్యాపీగా వుంటారు...వాళ్ళ స్వాతంత్రం వాళ్లకి ఉంటుంది కదా అండి...మనము అన్ని విషయాలు వాళ్ళకి తెలియ చేయటం వరకే మన బాధ్యతా...ఆ తరువాత వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం.ముఖ్యముగా పెద్ద వాళ్ళు ప్రవర్తన.....మారాలి...పిల్లల ముందు కొట్టుకోవటం,,తిట్టుకోవటం మానాలి...
ఇంకొకళ్ళ గురించి చెప్పుకోవటం....ఇవన్ని ఎందుకు పనికి రానివి...మనతో వాళ్ళు అన్ని విషయాలు మాట్లాదగాలిగెంత సోకర్యము మనము కలిగించాలి.


మన పిల్లలు మనతో కాకా ఇంకెవరితో చెప్పుకుంటారు.చిన్నపతినుచే అందరి మీద సానుబూతి చూపించే లాగా ,దయ చూపించే లాగా,పెంచాలి.మనుషుల మీద ఇష్టం ఏర్పడేలా పెంచాలి.ఇంట్లో కూడా హక్కుల కోసం...స్వాతంత్రాల కోసం కొట్టుకుంటూ ఉంటె పిల్లల మనసులో కూడా అవే పడతాయి...పెద్ద అయ్యాక మల్లి వాళ్ళ హక్కు,వాళ్ళ స్వతంత్రం..


మన,ము రోజు వార్తలు చూస్తూ ఉంటాము.వాళ్ళు అల చంపబడ్డారు,అమ్మని చంపిన కొడుకు,ఇలా ఇలా ఏవేవో....
సామెత కూడా వుంది అండి "మొక్కయి వంగనిది మాను అయి వంగుతుందా??" అని...కాబట్టి చిన్నప్పటినుంచి మనము పిల్లలకు మంచిని నేర్పిద్దాం..ప్రేమ నేర్పిద్దాం,,,దయ గుణం నేర్పిద్దాం.....కనీసం ఇప్పటి నుంచి అయిన దొంగలు ,గుండాలు కాకుండా పిల్లల్ని పెంచుదాము. పోటి వాతావరణాన్ని నేలకోల్పదు పిల్లల మధ్యన.


మన భాద్యత మనము సక్రమంగా నెరవేర్చితే..ఆ పైన దేవుడి దయ.....వాళ్ళని ఏమి చేయాలి అనుకుంటే అల తయారు చేస్తాడు.....
రేపు మరొక కొత్త విషయముతో మల్లి కలుద్దాము.