27, సెప్టెంబర్ 2012, గురువారం

ఏమిటో

ఏమిటో ఈ జీవితం?
ఈ జీవిత పయనంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము.
కొందరు మన జీవితంలో భాగం అవుతారు.
కొందరితో కొన్ని నిమిషాలు 
కొందరితో గంటలు 
కొందరితో రోజులు 
కొందరితో నెలలు 
కొందరితో సంవత్సరాలు 
కొందరితో చనిపోయేవరకు కలిసి ఉంటాము.
కాని అయ్యో నేను ఒంటరి వాడిని/దానిని అన్న భావన కనీసం ఒక్కసారన్న వస్తుంది.
ఆ భావన కూడా కొంతమందికి నిముషాలు,నెలలు,రోజులు,సంవత్సరాలు చివరకు చనిపోఎవరకు ఉంటుంది.
ఎన్ని రకాల మనస్తత్వాలు చూస్తూ ఉంటామో?
ఒకసారి ఇవన్ని కూర్చుని ఆలోచిస్తే వింతగా ఉంటుంది.

ఒక విషయం మాత్రం అర్థం అవుతూ ఉంటుంది.ఒంటరి తనం చాల కష్టం.మన చుట్టూ ఇంతమంది మనుషులున్న మన బాధ పంచుకునే వ్యక్తి లేకపోతే ఎంత నరకం గ ఉంటుందో కదా!

ప్రతి మనిషికి  కష్ట  సుఖాల్ని పంచుకునే వ్యక్తి తప్పకుండ  వుండాలి.
జీవితం చాల చిన్నది.
కోప తాపాలు ,ఈ గో  లు ,అనుమానాలు పెట్టుకోకుండా ఆనందంగా జీవిస్తే ఏ బాధ ఉండదు.
ప్రశాంత తను  మించినది మరొకటిలేదు అని నా ఉద్దేశ్యం...


ఉంటాను మీ 
అంజలి...