10, మార్చి 2011, గురువారం

మనుషులా రాక్షశులా (పిచ్చి జనం ,పిచ్చి గోల )

అసలు రాజకీయాలు అంటేనే నాకు ఇష్టం లేదు.కాని ఈ రోజు మిలియన్ మార్చ్ అంటూ వాళ్ళు చేసిన రచ్చ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.నా గుండె తట్టుకోలేకపోతోంది.టాంక్ బండు మీద ఉన్న విగ్రహాలు వాళ్ళని ఏమి చేసాయి.
ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఛి ...
గాంధీ గారు మనకు మన భారత దేశాన్ని ఇచ్చారు.దానిలో మల్లి భాగాలు.
బాబోయ్ నాయకులని చూస్తుంటే విసుకు వేస్తోంది. అసలు విద్యార్థులకి ...ఇలాంటి పనులకి లింక్ ఏమిటో నాకు అర్థం కాదు.చదువుకుని దేశాన్ని ఎలా అభివ్రుది చెయాల అని కాకుండా ఎలా ముక్కలు చెయాల అని ఆలోచిస్తున్నారు.
వీటికన్నా కూడా ఈ రోజు విగ్రహాలను నాశనం చేయటం అనేది చాల బాధపెడుతున్న విషయం.ఏనాటి నుంచో చక్కగా అందంగా ఉన్న వాటిని పాడుచేసారు.ఎక్కడో విదేశాల నుంచి వచ్చి వీటిని చూసి అందరు మెచ్చుకుని వెళతారు.ఇక్కడే ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేసారు..అసలు కొంచెం కూడా మానవత్వం,మంచి హృదయం అనేది లేదనుకుంట వాళ్లకి.
నాకు చాల సిగ్గుగా ఉంది.ఛి.ఛి. .........
ఇలాంటి మనుషుల మధ్యనే బతకాలి. తప్పదు కదా.
ఉంటాను....బాధతో............మీ అంజలి.

2 కామెంట్‌లు: