19, ఫిబ్రవరి 2011, శనివారం

సాయి లీల అమ్మ గారు

ఈ మధ్య నాకు ఒక విషయం తెలిసింది.
సాయి లీల అమ్మ అని ఒకావిడ వున్నారు.సాయి బాబా భక్తురాలు.హైదరాబాదు లో ఓల్డ్ అల్వాల్ లో ఉంటారు.ఆవిడకి దగ్గర దగ్గర 90 సంవత్సరాలు ఉంటాయి.ఆవిడని కలిసాను.ఆవిడ విజయవాడలో గోవిందరాజులు నాయుడు వీధి అని సూర్యారావు పేట లో ఉంటుంది..అయన కూతురు.ఎప్పుడో 1920 కి ముందు అయన డాక్టర్ అందుకే ఆ వీధికి ఆ పేరు వచ్చింది.
చిన్నప్పటినుంచి ఆవిడ సాయిబాబా భక్తురాలు.ఆవిడకి 11అంగుళాల జడ ఉంటుంది.ఎప్పుడు బాబా ధ్యానములో ఉంటారు.ఆవిడ ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళాను.చూడటానికి ఆవిడా మాములు మనిషిల శాంతంగా ఉన్నారు.చూడగానే మనసు ప్రశాంతత కలిగింది.ఆవిడా 1940 సంవత్సరం నుండి పూజిస్తున్న బాబా విగ్రహాన్ని పెట్టుకుని ఉంటారు.ఒక గుడిలగ కట్టుకున్నారు.
ఇంతకి ఆవిడ నాన్నగారు అంటే గోవిందరాజుల నాయిడు గారు బాబాను దర్సనం చేసుకుని ఉండచు. బాబాతో ఉన్నవాళ్ళతో దిగిన ఫోటోలు ఉన్నాయి.బాబా లక్ష్మి భాయి షిండే కి ౯ నాణేలు ఇస్తారు కదా...ఆ నాణేలను ఈ విధము గ దాచుకో అని చెప్పినవారు ఈ సాయి లీల అమ్మ గారే.
నా ఈ పోస్టును చదువుతున్నవారికి నమ్మకము ఉంటె ఒకసారి ఆవిడను దర్శించుకుని ఆవిడా ఆశీర్వాదం తీసుకోండి.అలంటి మహనీయులు చాల తక్కువ మంది ఉంటారు.ఆవిడా లీలలు కూడా చాల ఉన్నాయి.
అది అంది విషయం.ఉంటాను మరి...........మీ అంజలి.

4 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలండి. సాయిలీల అమ్మగారి గురించి ఒక పుస్తకం మా ఇంట్లో ఉందండి. అందులో సాయిబాబా గురించి , సాయిలీలమ్మ గురించి ఎన్నో విషయాలున్నాయి. నాకు వారు ఎక్కడుంటారో తెలియదు. ఈ మధ్య ఒకరిని అడిగితే ఆమె ఆల్వాల్ లో ఉంటారని చెప్పారు. వారి అడ్రస్ తెలియజేస్తారా ?.

    రిప్లయితొలగించండి
  2. తప్పకుండ చెప్తాను...


    మేడ్చల్ రోడ్ లో వెళ్తూ ఉంటె సుచిత్ర జంక్షన్ అని వస్తుంది.అక్కడ రైట్ తీసుకుని వెళితే లయోలా కాలేజులు వస్తాయి.అవి దాటి వెళుతూ ఉంటె లెఫ్టు సైడున హెచ్.ఏం.టి. ఆఫీసర్స్ కాలనీ అని బోర్డు వస్తుంది.ఆ రోడ్డులో వెళుతూ ఉంటె ఒక అడ్డ రోడ్డు వస్తుంది .అక్కడ లేఫ్టున చూస్తే ఒక గుడి గోపురం కనిపిస్తుంది. అక్కడ ఎవరినడిగిన చెప్తారు.
    మీరు తప్పకుండ వెళ్ళండి.మనసు ప్రశాంతముగా ఉంటుంది...తరువాత నాతో చెప్పండి...
    నేను ఇప్పుడే ఆవిడా దగ్గర నుండి వచ్చి మీ పోస్టు చూసాను.

    రిప్లయితొలగించండి
  3. Sobha,
    Nice information. You should take me there next time when I come over.
    keep posting.

    Santhi

    రిప్లయితొలగించండి
  4. chAlA manchi vishayam cheppAru. meeku sAi deevenalu tappaka vuntayi.

    రిప్లయితొలగించండి