31, జులై 2012, మంగళవారం

విద్య-విధానము


మా  అన్న  కొడుకు  అత్త  ఇదిగో నాకు సైబర్ ఒలమ్పిఆడ్  లో మంచి రాంక్ వచ్చింది చూడు అంటే    నవ్వాలో ఏడవాలో  తెలియని  స్థితి.......

ఒకడు నాన్న చుట్టాలు ఎప్పుడు వెళ్లి పోతారు? నేను చదువుకోవాలి. టైం వేస్ట్ అవుతోంది అంటే ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితి.

నానమ్మ,తాత  ఫోన్ చేస్తే మేము చదువుకుంటున్నాం అని మనవాళ్ళు అంటేను.....పోనిలే కొడుకు కోడలితో మాట్లాడదమంటె  మేము పిల్లలకి చదువు చెపుతున్నాము....తరువాత మాట్లాడతం అంటే వాళ్ళు కోల్పోయే ఆనందం...

ఈ రోజు నేను పూజ చేసుకుంటున్నాను ఆదివారమే కదా అని పేరంటానికి వదినలని పిలిస్తే అమ్మో ఈ రోజు ఆదివారమైన రేపు సోమవారం అన్ని ప్రిపే ర్  చేసి పెట్టుకోవాలి .ఈ రోజు అంత మాకు చాల పని ఉంది.మల్లి పొద్దున్నే లేవాలి అని చెప్తారు.

పోనీ సమ్మర్ హలిడే స్  కదా కొన్ని రోజులు పిల్లల్ని తీసుకురండి అంటే సమ్మర్ క్యాంపు  అని,స్విమ్మింగ్ అని,స్కేటింగ్ అని చెప్పాలంటే నాకు విసుకు వస్తోంది.
అసలు వీళ్ళు పిల్లల యంత్రాల? బుర్రలు అయితే పూర్తిగా పాడవుతాయి అని అర్థం అవుతోంది.పిచ్చి వాళ్ళు అయిన ఆశ్చర్యపోనక్కరలేదు.

హ...మర్చిపోయ మొన్న మా ఆడపడుచు వచ్చింది.హాయిగా తల స్నానం చేసి తను చెప్పిన మాట ఏమిటంటే...వదిన ఇంటర్ అంత అసలు తల స్నానం చేయటానికి టైం ఉండేది కాదు పొద్దున్న 6 కి బయలుదేరితే ఇంటికి వచెటప్పటికి రాత్రి 9 అయ్యేది.పడుకుని మల్లి పొద్దున్న వెళ్ళాలి.అని.నాకు మతిపోయింది.

పొద్దున్న 5:30 కి లేచి రెడీ అయ్యి గబగాబగా అన్ని పనులు చేసుకుని 7:30కాళ్ళ బస్సు ఎక్కితే స్కూల్ లో తిప్పలు పది ఇంటి వచెటప్పటికి 6:00 అదే ట్రాఫ్ఫిక్ ఉంటె ఇంకో గంట.

ఏమి తింటున్నారో.ఏమిటో పిల్లలకు బలము ఉండట్లేదు.ఇప్పటి  కూరలు,సరుకులే సరిగా పండక..హైబ్రిడ్..ని ఏవేవో చేసి అమ్ముతున్నారు.ఆ పైన పిల్లలు తిండి తినే టైం లేదు...అసలు పెద్ద అయ్యాక వీళ్ళకి బలం ఉంటుందా.ఆడపిల్లల పరిస్థితి అయితే మరి అన్యాయం...

దయచేసి పెద్దలందరూ ఒకసారి ఆలోచించండి ..ఈ విద్య-విదానంలో ఏమన్నా మార్పు తేవచేమో......చేతులారా మన,మన పిల్లల జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం .ఆటలు లేవు..మైండు కి తగినంత అక్తివితి లేదు.

ఇంకా చాల బాధలు నష్టాలు ఉన్నాయి.ఉపయోగం నాకు కనిపించట్ల....పోటి  తత్వం పెరుగుతోంది.అది ఆరోగ్యకరమినది కాదు..ఎంత రాసిన రాస్తూనే ఉంటాను.

ఉంటాను.
మీ అంజలి....