9, సెప్టెంబర్ 2013, సోమవారం

21 PATRALA VIVARANA

మన బొజ్జ గణపయ్యకి వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాం కదా....
మనకి బయట బోల్డు ఆకులూ అమ్ముతారండి...అవన్నీ ఏవేవో ఉంటాయి.అసలు అవి ఏమిటో తెలియదు.అవి పెట్టచో పెట్టకుడదో తెలియదు.
ఏకవింశతి అంటే ౨౧ రకాలు అన్నమాట.వీటి గురించి చెప్తాను వీటితో చేస్తే సరి.అవి
1.బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
2.మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
౩.బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.
4.దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.
5.దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
6.బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
7.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
8.అపామార్గ పత్రం(ఉత్తరేణి): దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.
9.చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
10.జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
11.గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
౧౨.అశ్వత పత్రం(రావి ఆకు):చాల ఓషధగుణాలు ఉన్నాయి.
13.అర్జున పత్రం(మద్ది ఆకూ):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
14.అర్క పత్రం(జిల్లేడు ఆకూ) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15.విష్ణు క్రాంతం(విష్ణుక్రాంతం ):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకూ):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
17.దేవదారు(దేవదారు):-శరీర వేడిని తగ్గిస్తుంది.
18.మరువాకం(మరువం):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
19.సింధువార పత్రం(వావిలాకు):కీల్లనోప్పులకు మంచి మందు.
20.శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

21.కరవీర పత్రం(గన్నేరు):-గడ్డలు,పుల్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.
ఇవి అంది ౨౧ రకాలు.వీటితో చేస్తే చాలు...అనవసరంగ మనకు తెలిసి తెలియక ఎందుకు అంది బయట పిచి ఆకులూ అన్ని కొనటం చేయటం.
పైగా వీటిల్లో చాల మొక్కల్లు మనింట్లో ఉండేవే.లేదంటే బయట ఒక చుట్టూ తిరిగితే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాయి.అంతే.

VINAYAKUDU-----21

నేను ఎకవిమ్సతి పత్రాల గురించి రాసాను కదా అంది...ఆ రోజు నుంచి అసలు 21 కి వినాయకుడికి సంభంధం ఏమిటి?21 పత్రాలె ఎందుకు వాడుతున్నారు ఇలా దౌబ్త్స్ మొదలయ్యాయి......ఆలోచిస్తూ ఆలోచిస్తూ కలంగాడుపుతూ ఉంటే....నిన్న రాత్రి ఏదో బుక్ చదువుతూ ఉన్నా...అందులో ఖచితంగా నా ఆలోచనలకి జవాబు ఉంది.
నాకు చాల ఆశ్చర్యం వేసింది.పైగా అది వినాయకుడికి సంభందించింది కూడా కాదు......
సర్లెండి...ఏమో కాని.....మీతో కూడా ఆ వివరాలు షేర్ చేసుకుంట....ఓకే
పరమ శివుని అనుగ్రహంతో శ్రీ గణేశుడు ఇంక ఇరవై రూపాలు ధరించాదుట..
అంటే మొత్తం 21 మంది అన్నమాట .
ఇంక పార్వతి దేవి ఎనలేని ఆనందం తో ఆ ౨౧ మందికి ౨౧ పేర్లను పెట్టి చాల ఆనందంగా చుసుకుంతోందిత.
ఇంక వాళ్ళకి బ్రహ్మ మానస పుత్రుడు ,ఉప బ్రహ్మ ఐన విశ్వ దర్శి కుమార్తెలు 21 మందిని ఇచ్చి వివాహం చేసారుట.
ఈ ౨౧ మంది గణపతులను తలచుకుంటే అన్ని శుభాలు జరుగుతాయట.
వారి పేర్లు...
1.శ్రీ గణేశుడు-జయ లక్ష్మి :--- లక్ష్మి గణపతి అని పిలుస్తారు..సర్వ కార్యాలు జయప్రదం చేస్తాడు.
2.సిద్ది గణపతి -సిద్ది బుద్ది లక్ష్మి :-ఈయన సిది బుధి ప్రదాయకుడు.
౩.చింతా మని గణపతి - విజయ లక్ష్మి :-ఈయన విజయ ప్రదాత.
4.ఏక దంత గణపతి-సిద్ది లక్ష్మి:-సర్వ సిద్ధులు అనుగ్రహిస్తాడు.
5.వక్ర తుండ గణపతి-నవ రత్న లక్ష్మి :- నవ విధులు అనుగ్రహిస్తాడు.
6.లక్ష్మి ప్రద గణపతి-వీర లక్ష్మి :-వీరత్వం వ్రిద్ది కావిస్తడు.
7.నింబ గణపతి-బుద్ది లక్ష్మి:-బుద్ది కుశలత అనుగ్రహిస్తాడు.
8.లంబోదర గణపతి-సిద్ధ విద్యదేవి:- సర్వ విద్య ప్రదాత.
9.రునవిమోచన గణపతి-సౌభాగ్య లక్ష్మి:-రుణ విమోచన కారకుడు.
10.శుక్ల గణపతి-బుద్ది లక్ష్మి:-సుబుద్ధిని అనుగ్రహించగలదు
11.ధూమ్ర గణపతి-సిది లక్ష్మి:-సర్వ సిది ప్రదాత.
12.రక్త వర్ణ గణపతి-పద్మా దేవి:-గ్రహ దోష నివారకుడు.
13.సువర్ణ గణపతి-రజితా దేవి:- సువర్ణ రజత ప్రదాత.
14.విగ్గ్న గణపతి-ప్రజా దేవి:-సర్వ విగ్గ్న హరుడు.
15.నిర్విగ్న గణపతి-అతి ప్రజ్ఞా దేవి-నిర్విగ్నంగా కార్య సమాప్తి కావించ సమర్ధుడు.
16.వికట గణపతి-జ్ఞాన దేవి:- జ్ఞాన ప్రదాత.
17.బాల చంద్ర గణపతి-చంద్రముఖి:-ఆనంద ప్రదుడు.
18.సర్వాంబర గణపతి-సంహార దేవి:-శత్రు సంహార కారకుడు.
19.గణాధిపతి-శాంతా దేవి:-శాంతి ప్రదుడు.
20.భద్ర గణపతి-లోకమాత దేవి:-శాంతి భద్రతల సంరక్షకుడు.
21.చివరిగా మనమందరం వర sidhdhi  వినాయకుడు అని పిలుచుకుంటాం...
ఇది అంది విషయం...అందువలన అనుకుంట ౨౧ అనే సంఖ్యా వచ్చింది...
******ఏమన్నా తప్పుగా వున్నా యెడల క్షమించగలరు..నాకు చెప్పండి సరి చేసుకుంటాను...

18, ఏప్రిల్ 2013, గురువారం

సత్య సాయి నిగామగమం చాగంటి గారు

అందరికి నమస్కారములు,

నేను నాలుగు రోజులుగా "సత్య సాయి నిగామగమం " శ్రీ నగర్ కాలనీ  లో జరుగుతున్న "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు " గారు చెప్తున్నా "శ్రీ సుబ్రహమన్యే శ్వర  స్వామి వారి వైభవం " వినటానికి వెలుతున్నాను . మనసుకు హాయిగా ఉన్ధి.ఇన్థ అదృష్టం కలగటం నా జీవితంలో రెండవ సారి. మొదటిది ఇషా సద్గురు గారి స్పీచ్ వినటం . రెండవది చాగంటి గారి ప్రవచనాలు వినటం .   అది కూడా కుమారస్వామి వైభవమ్. 
చాల అద్భుతం గ వున్నయి. 
నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే  మంగళవారం షష్టి తిథి రోజు ప్రసాదం పెట్టారు .  ఆ రోజు తోపులాట అంత ఇంత కాదు .   చాగంటి గారి ప్రవచనాలు వింటున్న ,ఏ మాత్రం విచక్షణ లేకుండా తోసుకుంటూ వెళుతున్నారు ప్రసాదం కోసం .చగన్తి గారు చెప్తున్నా వినిపించుకొవట్లెదు . 
మల్లి ఈ రోజు  గురువారం పసుపు,కుంకుమ , గాజులు ఇస్తారు లైన్ లో వెళ్ళండి అంటే  తోపులాట . కనీసం ముసలి వాళ్ళు ఉన్నారు అని కూడా చూసుకోకుండా అల తోసుకుంటున్నారు . అమ్మవరివి మనకి ప్రసాదం గ ఇవ్వాల్సిన గాజులు ఎన్ని పగిలిపోయయో తెలుసా తోపులాట మూలంగా ? మాకు దక్క లేదు . 
చాల బాధగా ఉంది . దయచేసి ఈ బ్లాగ్ చదివే వాళ్ళు ప్రసాదం పెట్టె చోట ఎక్కడ తోసుకోవదు అని మనవి . మనము క్యూ  పద్ధతి పాటిస్తే మన వెనుక వాళ్ళు కూడా పాటిస్తారు . 

రేపు కళ్యాణము,అభిషేకము నాకు చాల భయము, బాధగా ఉంది .. 


అసలు ఇవన్ని చూసి చాగంటి గారు మళ్ళి  హైదరాబాదు వస్తార ప్రవచనాలు చెప్పటానికి? దయ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు . మళ్ళి  అయన హైదరాబాద్ వచ్చి ప్రవచాలు చెప్పేట ట్టు గా ప్రవర్తిద్దాము . 

తప్పు అనుకుంటే క్షమించండి . 
మీ అంజలి .... 


31, డిసెంబర్ 2012, సోమవారం

wish you a happy and healthy new year

30, డిసెంబర్ 2012, ఆదివారం

EAMCET PAPERS


అందరికి ధన్యవాదములు...


" ఎంసెట్ " పరీక్ష వ్రాసేవరందరికి ఒక శుభవార్త అండి. ఏమిటంటే మా శ్రీ వారు  మరియు కొంతమంది సభ్యులు కలిసి

ఒక ప్రాజెక్ట్ చేసారు .చక్కగ  నెట్ లో ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ prepare  అవ్వచ్చు మరియు online లో ఎగ్జామ్స్

వ్రాయచ్చు.

దీని గురించి తెలుసుకోవాలంటే  "www.practise2success .com "  ను ఒక సరి visit  చేయండి.

మీకు తెలిసిన వారికి తెలియ చేయండి.

దీని వలన మీకు చాల లాభములు ఉంటాయి ...చాల చాల experienced lecturers చేత వ్రాయిన్చాబడి నవి.

అందువలన మీకు ఇది మంచి అవకాసం.

మీకు వివరములు కావాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు:

1 . 9951079444 

2 . 9553295677 


మీరు ఈ numbers  కి ఫోన్  చేసి వివరములు తెలుసుకోండి.

ఉంటాను... అల్ ది బెస్ట్ ...ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ .

మీ
అంజలి.

gang rape

అందరికి నమస్కారములు ,


నేను నిన్న టీవీ  ముందు అరగంట కూర్చున్న న్యూస్ పెట్టుకుని .....ఆ అరగంటలో గ్యాంగ్ రేప్ జరిగింది.అమ్మాయిని సింగపూర్ తీసుకెళ్ళారు.ఎంత ప్రయత్నిచిన ఫలితం లేదు.ప్రాణంతో పోరాడి మరణించింది .
ఇదే ఊదరకొట్టారు కాని.......చేసిన వారు,నిందితులు ఎవరు,ఎలా రక్షణ తీసుకోవాలి అని మాత్రం నేను చూడలేదు.
ప్రత్యూష కేసులో నిందితులు లేరు  
శ్రీలక్ష్మి కేసులో నిదితులు లేరు.
ఏ అమ్మాయికి  జరిగిన అన్యాయంలో నిందితులు లేరు.
అమ్మాయిలు మేలుకోండి.......జాగ్రత్తగా ఉండండి.
మీకు మీరే రక్షణ కల్పించుకోవాలి.
కారం పాకెట్లు ,కర్పూరము,అగ్గిపెట్టె ,బయట చాల sprays  వచ్చాయి.పెప్పర్ స్ప్రే  మొదలగునవి.
అనవసరమైనవి కాకుండా ప్రతి అమ్మాయి హాండ్ బాగ్  లో ఇవి ఉండేలా చూసుకోండి.ధైర్యాన్ని  కోల్పోవద్దు.
అప్పటికప్పుడు మెలుకువగా ప్రవర్తించండి.కంగారు పడద్దు.మనకి ఏమి అవదు అనే ధైర్యంతో ఉండండి.
చివరగా ఎక్కడ కొట్టా లో అక్కడ మోకాలితో ఒక్కటి ఇస్తే అంతే .....
నేను ఏమి తప్పుగా వ్రాయలేదు అనే నమ్మకంతో వ్రాసాను.
తప్పుగా వ్రాసి ఉంటె క్షమించండి.

ఉంటాను 
మీ అంజలి .....26, అక్టోబర్ 2012, శుక్రవారం

నేను -నా షాపు

నేను HEALTHY  INDULGENCE  అని ఒక షాపు విజయదశమి  రోజున ఓపెన్ చేసుకున్నాను.


ADDRESS :
                Healthy Indulgence,
                kavitha apartments ground floor,
                opposite to china bazar,
                vengalrao nagar mainroad,
                hyderabad.దీనిలో ముఖ్యముగా  diabetic patients  కి సంభందించిన ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి.ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి.B .P and  sugar  monitors ఉన్నాయి.

ISHA  products  అన్ని ఉన్నాయి.like  sanjeevini  porride ,dosa  mixes ,no .of  hand  made soaps ,shampoos ,conditioners ,etc  ఉన్నాయి.

ఒక్కసారి షాప్  కి రండి.చూడండి. సలహాలు ఇవ్వండి.మీకు నచితే కొనుక్కోండి.

ఉంటాను,
మీ అంజలి ....