15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఆరోగ్య శ్రీ

చాలా రోజుల తరువాత వ్రాస్తున్నాను...
ఈ మధ్య ౩ రోజుల క్రితము మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది..
అది ఏమిటంటే మా ఇంట్లో పని చేసే అమ్మాయి పేరు కుమారి.......ఈమే కొన్ని రోజుల నుంచి గుండెలో నొప్పితో బాధ పడుతోంది.అంటే ఆయాసము కూడా వస్తోంది.
అనుకోకుండా మొన్న మా ఇంట్లో వచ్చింది.నాకేమి చేయాలో తోచక వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకు వెళ్లాను. అక్కడ మా అదృష్టం బావుంది ఒక లేడీ డాక్టర్ ఉన్నారు.ఆవిడా చూసి వెంటనే ఈ .సీ.జి తీయించుకు రమ్మన్నారు.సరే కదా అని ౩ హాస్పటల్స్ కి తిరిగాము...ఎవారు తీయలేదు.ఒక చోట వెళ్లి అడిగితే లేడీ టెక్నిశియన్ లేరు అన్నారు...పర్లేదు అని మగ అతనినే తీయమన్నాము.పాపమూ అయన వెంటనే తీసి రిపోర్ట్ ఇచారు.
సరే అది తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము..మా అదృష్టము కొద్ది ఆవిడా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ కి హెడ్ ...ఇంకా ఆవిడ వెంటనే మీరు కిమ్స్ కి వచేయండి..అక్కడ ఆరోగ్యశ్రిలో చూస్తారు.అన్ని టెస్ట్లు చేయిన్చుకోవాచు అన్నారు..
ఇంతకి నాకు కూడా అప్పుడే తెలిసిన విషయము ఏమిటంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు "తెల్ల రేషన్" కార్డు ఉన్న వాళ్లకి "రెండు లక్షలు" రూపాయలు ఉచితముగా ఇస్తారుట...అంటే వాళ్ళని ఉచితముగా చూస్తారు అన్నమాట.అంటే ఒక కుటుంబములో నలుగురు ఉంటె వాళ్ళ ఒక్కోకల్లకి రెండు లక్షల రూపాయలు ఉచితముగా చూస్తారు...
ఇంకా ఆ అమ్మాయి వెళ్లి చూపించుకుంది.మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విషయము..కాని నాకు ఆలస్యముగా తెలిసింది...నేను ఇక్కడున్న జనాలకి అందరికి చెప్తున్నాను..తెల్ల రేషను కార్డు తీసుకోమని.
దయచేసి మీరు కూడా అందరికి చెప్పి దాని వలన ఉపయోగాలు చెప్పి...కార్డు తీసుకునేల ప్రోత్స హిమ్చండి.
చదువులేని వాళ్ళు వాళ్ళ అందరు...ఎంత చెప్పిన అర్థం చేసుకోవట్లేదు...దయచేసి అర్థం అయ్యేటట్లు చెప్పండి.
ఇంకా ఉంటానండి. మీ స్నేహితురాలు...అంజలి.

4 కామెంట్‌లు:

  1. Good information.

    But this program is there for the last 6 or 7 years. And it was one of the widely advertised or publicized program by YSR Govt., apart from Jala Yagnam. It is rumored that YSR win 2nd time because of this program. Most of the people already know about this program in AP.

    Getting the White Card and availing the benefits is a different thing. Here people need help.

    రిప్లయితొలగించండి
  2. thank u agnatha(prakash)garu,yeppati nuncho unna naa laage chala mandiki theliyadhu.anduke maname konchem pracharam chesthe bavuntundhi ani..........

    రిప్లయితొలగించండి
  3. శోభ గారు నాకు రాజకీయాలు అంటే అసహ్యం అన డం ఒక ఫాషన్ . మీరు చెప్పిన ఆరోగ్య శ్రీ కూడా ఒక రాజకీయ నేత రాజకీయాల్లో బాగంగానే ప్రవేశ పెట్టారు. రాజకీయాలను కాదు చెడును వ్యతిరేకిద్దాం

    రిప్లయితొలగించండి