28, జనవరి 2009, బుధవారం

అమ్మ మనసు

ఎప్పుడో ఒక సారి ఈనాడు పుస్తకములో వచ్చింది "అమ్మ మనసు " గురించి .
నాకు బాగా నచ్చినది.




...నువ్వు మొదటి సారిగా గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!
నిద్ర రానీయకుండా హడావిడి చేస్తుంటే ఉత్సాహముగా అనిపించినది ఉషారైనవాడివి అని!
నను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివి అని!
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి అవ్వాలని!
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకోలేనంత ఆనందం పొంగింది నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని!
ఆ అడుగుల్లోనే నాకు దూరమైతే ఆశీర్వదిమ్చాలి అనిపించింది గొప్పవాడివి అవ్వమని!
జీవన ఒత్తిడిలో పడి నన్ను మర్చిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా బ్రతకగలవని !
ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి వుంది అని!
ఇప్పుడే నాకు కొంచెం బాధగా వుంది అందరు నేను పోయానని ఏడుస్తుంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమో అని!
.....బావుందా అండి. నాకు ఐతే చాలా బావుంది...చాలా ఏడుపు వస్తుంది ఇది చదివినప్పుడల్లా....
ఎవరు రాసారో కాని వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు అండి.
నాన్న మనసు గురించి కూడా నా తరువాతి పోస్ట్ చూడండి.

2 కామెంట్‌లు:

  1. మాతృదేవోభవ.
    అమ్మమనసు నచ్చని తనయులుంటారంటే ఆశ్చర్యం..
    తెలుపకున్నా తగులుకునే సంతృప్తి అమ్మమనసు.
    చాలాబాగుంది.

    రిప్లయితొలగించండి