18, జనవరి 2009, ఆదివారం

మా అందమైన ఊరు ఉండవల్లి,నేను ,మా ఇల్లు,మా కుటుంబం...

అస్సలు మా ఊరి గురించి చెప్పాలి కదా అండి. మాది ఉండవల్లి.ఇది కావటం గుంటూరు జిల్లా ఐన కానీ విజయవాడకి దగ్గర.విజయవాడకి, ఉండవల్లికి మధ్యన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది.బ్యారేజ్ మీద నుంచుంటే చాల బావుంటుంది..చుట్టూ పక్కల ప్రకృతి చాల బాగా కనిపిస్తుంది.సరేలెండి...ప్రస్తుతానికి మా ఊరు గురించి కదా చెప్పేది.
సహజం ga పల్లెటూరు అంటే మనుషులు అందరు కలుపుగోలుగా వుంటారు.సాయంత్రం అయింది అంతే అందరు బయటే.మా ఊరు అంతే నండిచాల బాగుంటుంది.నేను౨ వ తరగతి చదువుతున్నప్పుడు నుంచి ఉండవల్లిలోనే ఉన్నాం అంటే సుమారు ౧౭ సంవత్సరాలు అవుతోంది.అప్పటికి ఇప్పటికి చాల మార్పులు వచాయి.అప్పుడు నిజంగా పల్లెతురిలా ఉండేది.ఇప్పుడు కొంచెం పట్నం వాతావరణానికి దగ్గరగా వస్తోంది.జనాబా ఎక్కువ అయ్యారు..కానీ ఇప్పటికి పంటలు పండిస్తారు..చామంతి,బంతి,గులాబీ,అబ్బో బోల్డు రకాలు అన్ని చాల బాగా ఉంటాయి.అరటి తోటలు ఐతే చెప్పక్కర్లేదు బోల్డు.కార్తిక మాసం వచ్చింది అంటే చాల ఇంక వనబోజనాలు..చాల చాల వండుకుని వెళ్ళే వాళ్ళం..సాయంత్రం వరకు ఆడుకోవటం ఇంటికి రావటం పడుకోవటం.అలాగే అన్ని రకల పండుగలు కలిసి చేసుకుంటాం..సంక్రాంతి ఐతే ఇంక బాగా జరుపుకుంటాం...
మా ఇంట్లో ఐతే ఏమి పిండి వంటలు చేసుకోవక్కర్ల.నేను ఒక్కదాన్నే ఉంటాను అని అందరు చాల రకాలు ఇచే వాళ్ళు నాకు.అందువలన అందరి ఇళ్ళలో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ పిండి వంటలు ఉండేవి.ముగ్గులు పోటి పది పెద్ద పెద్దవి వేసేవాళ్ళం.అక్కడ హరిదాసులు,గంగ్గిరేద్దులు,గొబ్బెమ్మలు అసలు పల్లెటూరే వేరు అంది.ఎంత బావుంటుందో.కోత బియ్యం వస్తాయి కదా అటుకులు మరలు వుండేవి..చక్కగా వడ్లు నన పెట్టుకుని వెళితే అటుకులు వేసి ఇచే వాళ్ళు.
ఒక విషయం మర్చిపోయాను...నేను చిన్నప్పుడు రూపాయికి నాలుగు ఇడ్లిలు ఇచే వాళ్ళు.అబ్బ దానిలోకి పచడి ఉండేది సూపర్ ఇంక రుచి చెప్పక్కర్లేదు..కొన్ని సార్లు ఐతే పచడి ఒక్కటే తేచుకునేవాళ్ళం.
పైగా మా నాన్నగారు ఉండవల్లి కి పంచాయతి ఆఫీసర్ అన్నమాట..ఇంక మనకి కొంచెం గవురవం ఇచేవాళ్ళు...
అల అల అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపదిపోయం.ఇంక మా ఇల్లు చాల బాగుంటుంది.చిన్న స్థలంలోనే కట్టుకున్నాం..కానీ ముందు మొక్కలకి స్థలం వదిలి కట్టుకున్నాం...ఇంక మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది.రసం మామిడి చెట్టు..ఇంక ఆ కాయలే మాకు అన్ని రకల పచల్లకి.....
మల్లి అందరు కోసుకుని పోతు ఉంటారు..దానికి కాపలా
గులాబీలు,మల్లె,సన్నజాజి,కనకాంబరాలు ,మందారాలు అన్ని రకల చెట్లు ఉన్నాయి....మా నాన్న గారికి చాల ఆసక్తి ఎక్కువ మొక్కలంటే.అందుకని ఏవో ఒకటి పెంచుతూనే ఉంటారు...
అన్నట్టు చెప్పటం మరిచాను మేము మొత్తం ౫ గురం...మా అమ్మ,నాన్న,ఇద్దరుఅన్నలు,నేను ........ప్రస్తుతానికి ఐతే మా అందరికి పెళ్ళిళ్ళు ఐపోయాయి...అందరం ఇప్పుడు హైదరాబాద్.....ఉరుకులు,పరుగులు జీవితం.
అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం ఉండవల్లికి.
ఇక పోతే మా ఊరిలో గొప్పగా చెప్పుకోవలసింది..గుహల గురించి..అక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది..ఎంత బావుటుందో..అక్కడ పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకునే వాల్లుట ...మల్లి మంగళగిరిలో పానకాల స్వామి గుడి ఉంది ...ఇక్కడ గుహలు ఉన్నా కొండ నుంచి అక్కడ మంగళగిరిలోని పానకాల స్వామి గుడి వరకు కొండలోనే స్వరంగా మార్గం ఉందిట.కాని అది మూసేసి ఉంది.
ఇంక గుహల దగ్గరలోనే కొండవీడు వాగు ఉంది..కొంచెం ప్రమాదకరం ...అప్పుడప్పుడు వరదలు వచినప్పుడు పొంగుతూ ఉంటుంది.
గుహల గురించి పూర్తిగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి
http://en.wikipedia.org/wiki/Undavalli_caves

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి