27, జనవరి 2009, మంగళవారం

ఉద్యోగమూ...భార్య-భర్త..

నా ఆలోచనలు కొన్ని రాస్తున్నాను....మరి తప్పో ఒప్పో నాకు ఐతే తెలియదు...నా బ్లాగ్ పేరే "anjali's thoughts".
నేను నా ఊహలను ,నా ఆలోచనలను మీతో చెప్తున్నాను...మీరు చదివి ఎలా ఉందొ చెప్పండి.
అస్సలు విషయం ఏమిటంటే అంది భార్య-భర్త ,ఉద్యోగాలు,పిల్లలు వీటి గురించి రాద్దామని అండి...ప్రస్తుత సమాజంలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని ఇల్లు గడవదు అని చెప్తూ ఉంటే వింటున్నాను..నిజమేలెండి బయట పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి..అన్ని ధరలు పెరిగిపోయాయి.ఈ కారణం ఐతే నిజమేనండి .కాని,,కోరికలు తీర్చుకోవటం కోసం అంటే కొంచెం నాకు ఎందుకో కష్టం గ అనిపిస్తుంది.దీని కోసం భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేయనక్కరలేదు కదండీ.ఆడవాళ్ళూ కచితం గ చదువుకోవాలి.కాని ఉద్యోగం చేయాలని లేదు కదా... పెళ్లి అయిన తరువాత ఇంట్లో ఉంది అన్ని పనులు చేసుకోవటం సబబు అని నా అభిప్రాయం.ఎందుకంటె అండి దీనికి రెండు కారణాలు ఉన్నాయి..
౧.మనమే చక్కగా ఇల్లు సర్దుకోవచు.మన భర్త ఇంటికి వచ్చేటప్పడికి మనము ఆయనకు కావలసినవి అన్ని తయారు చేసి పెట్టి చక్కగా ఆయనతో కబుర్లు చెప్తూ పిల్లలు,భర్త,భార్య ఎంత చక్కగా వుంటుంది అండి...మనకి టైం ఉంటుంది కాబట్టి పోషక విలువలు ఉన్నా ఆహారం తయారు చేయచ్చు..విసుకు ఉండదు.పైగా మనకి కావలసినంత సమయం ఉంటుంది కాబట్టి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకొవచు.మన ఇంటిని అందం గ డెకరేట్ చేసుకోవచ్చు.అప్పుడప్పుడు అల సరదాగా స్నేహితులతో బయటకు వెళ్లి షాపింగ్ చేసుకుని రావచ్చు.మన ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి అన్ని సమకూర్చవచ్చు. అదే ఉద్యోగం చేస్తూ ఉంటే ఇవేమీ ప్రశాంతముగా చేయలేము.పిల్లలు పాడైపోతారు.వాళ్ళకి ఏ విషయాలు తెలియవు.భర్త ఇంటికి వచ్చేటప్పటికి మనము ఇంట్లో లేకపోతే ఆయనకి చాల కష్టంగా వుంటుంది.వాళ్లు ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవటానికి ప్రయత్నిస్తారు.ఆ టైములో మనము ఆయనకు ఫ్రెండ్ లాగా వుండి అన్ని షేర్ చేసుకుని కాస్త టీ ఆర్ కాఫీ ఇవ్వటం లేక ఏమన్నా తినటానికి చేసిపెట్టటం చేస్తే బావుంటుంది.అప్పుడు భార్య-భర్త యెకూఅ సేపు గడిపినట్టు ఉంటుంది..పైగా పిల్లల చేత మనమే స్కూల్ వర్క్ చేయించవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే చాల వుంటాయి అంది.మల్లి ఒక వేళ మనము అత్త,మామగారిని చూసుకోవాల్సి వస్తే ఉద్యోగం ఉంటే అస్సలు వీలు పడదు.మల్లి వాళ్ల కోసం ఒక పని అమ్మాయి...ఇవన్ని ఎందుకు అంది..ఎంత చక్కగా మనమే చేసిపెడితే వాళ్ళకి సేవ చాల బావుంటుంది కదా.పాపం వాళ్లు కూడా వయసులో ఉన్నప్పుడు కస్టాలు పడే ఉంటారు.మల్లి ముసలి వయసులో కస్తపెట్టటం ఎందుకు? అందువలన నా మటుకు ఏమి అనిపిస్తుంది అంటే....భర్త సంపాదించే డబ్బు మన కుటుంబ పోషణకి సరిపోతుంది అంటే భార్య వుద్యోగం చేయనక్కరలేదు...
౨.ఇది చాల ముఖ్యమైన విషయం అంది.....ఒక భర్త వుద్యోగం చేసిఒక కుటుంబం మొతము బతుకుతుంది...అదే ఉద్యోగం ఒక ఆడమనిషి సరదాకి ఉద్యోగం చేస్తే ? అదనపు డబ్బు,,,లేక టైం పాస్......ఉదాహరణకి ఒక ఉద్యోగానికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి కనక సెలెక్ట్ అయ్యి ఒక్కటే ఖాలీ ఉంటే నేను మాత్రం అబ్బైకి ఇవ్వటం కరెక్ట్ అంటాను..
****ఏమండీ నా మీద కోపం తేచుకోవదు..ముందుగానే చెప్పాకదా అంది ఒక వేళ అడ వాళ్ళు టైం పస్స్కో,లేక కోరికలు (luxurious life గడపాలి) కోసమో అయితేనే.... నిజముగా అత్యవసరము ఐతే మాత్రం ఆడ వాళ్లు కూడా తప్పకుండ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి.****
అందువలన మగవాళ్ళు ఉద్యోగాలు చేసినట్లితే చాల మటుకు కుటుంబాలు కడుపునిండా అన్నం తింటాయి అనిపిస్తోంది అంది.చాల మంది ఖాళీలు లేక ఉద్యోగం చేయలేకపోతున్నారు.అందువలన ఆ ఉద్యోగం ఒక మగవాడు చేయటానికి వీలు కల్పించినట్లు ఐతే ఒక కుటుంబం బాగు పడుతుంది..మనము సహాయ పడ్డట్టు అవుతుంది. ఇది కేవలము నా ఆలోచన మాత్రమె...నా ఈ పోస్ట్ చదివి అందరు మీ అభిప్రాయాలను కూడా తెలపాలని నా కోరిక.

5 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ముందుగా, మీ పోస్ట్ చదవడానికి కష్టపడవలసి వచ్చింది. కలర్ కాస్త మారిస్తే సులభంగా చదువుకోవచ్చు.
    చాలా మంచి పోస్టు వేసారు. భర్త ఉద్యోగం చేయాలి అన్నారు కానీ భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంటికి పట్టున ఉండకూడదా అనలేదు. జంబలకిడిపంబ సినిమా చూసి భయపడ్డారా..just kidding

    ఇక, ఇద్దరూ ఉద్యోగం చేయాలా వద్దా అన్నది తేలడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు అక్కరలేదు. కేవలం అరగంట చాలు. ఎలా అంటారా? ఒక పేపరు పెన్ను తీసుకొని - ఉదాహరణకు
    1) ఇల్లు, కారు మొదలయినవి కావాలా? అయితే సేవింగ్స్‌లో ఎంత శాతం వాటికి పెట్టాలి?
    2) మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? నెల సరి జీతంలో ఎంత శాతం మిగల్చగలము?
    3) ఎంత మంది పిల్లలు, వారి సరాసరి ఖర్చులకు తగిన సేవింగ్స్ ఉన్నాయా?
    4) అత్యవసర పరిస్తితుల్లో కావలసిన డబ్బు ఉందా?
    5) ప్రతి ఏడాది కొద్ది రోజులు టూర్ వెళ్ళాలి అనుకుంటున్నారా లేక దగ్గరలోని చిన్న ఊరికి వెళ్ళాలనుకుంటున్నారా?

    మొదలయినవి రాసుకోండి.

    డబ్బు అన్నది జీవితానికి Driving Factor మాత్రమే కానీ జీవితం కాదు, డబ్బు కంటే విలువయినది ఆనందం. కొందరికి బాల్కనీలో కూర్చొని 2 రూపాయల విలువయిన కాఫీ తాగడంలో ఆనందం ఉంది, కొందరికి ఫైఫ్ స్టార్ హోటల్లో 100 రూపాయలకు కాఫీ తాగడంలో ఉంది. కాబట్టి మనకు కావలసినవి ఒక పేపరు పైన రాసుకుంటే ఇట్టే తెలిసిపోతుంది.

    ఎలా ఉన్నాయి శ్రీరంగనీతులు :)

    రిప్లయితొలగించండి
  3. బాగా రాశారు. నా ఆలోచనలు కూడా ఎగ్జాక్ట్లీ ఇవే.
    జీడిపప్పు గారి శ్రీరంగ నీతులు కూడా హిట్టే.

    రిప్లయితొలగించండి
  4. naku intha manchi topic with same content yekkada kanipinchalaaaa...promisss....kani entha mandi real ga ila enjoy cheyya galaru ...more money ill not make you happy its true ....like ho happy i was ith 5k salory , as same hen i as getting 50k... but after marriage again it depends on other partner interests also ....its not easy husband and ife both compromise on lifestyle...these day every one feel to have a house (hich is not easy ith salory...and same time not east to pour in money in name of rents) .....and once kids comes, just one salory makes you think of too cautious on spending ...to save for them ... rather to get BP ith all these thoughts, I feel woman should work and drop the idea of kids ..wot you say .....then it ould not be a problem to maintain good food and home ..:P


    can't say any better than this ...

    రిప్లయితొలగించండి
  5. Mostly 'W' is missed while typing ...sorry

    and i was kidding at the end ... other way of having kids and drop the idea of working ....

    its not that easy as said to carry on with one salory ( provided the other partner can make it a job) ...

    రిప్లయితొలగించండి