17, జనవరి 2009, శనివారం

జుట్టు పెరగటానికి చిట్కాలు

౧. రాత్రి పూట తలకు బాగా కొబ్బరి నూనె రాసి ఉదయాన్నే కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి.
౨.వారానికి ఒక సారి కోడి గుడ్డు లోని తెల్ల సోన ను తలకు రాసుకుని గంట తరువాత తల స్నానం చేయాలి.పొరపాటున పచ్చ సోన పెట్టుకునేరు తలలో జుట్టు ఆమ్లెట్ లాగా అవుతుంది.చక్కగా పచ్చ సోనతో వుల్లిపాయ చేర్చి కూర చేసుకోండి .చాల బావుంటుంది కదా!
౩. వారానికి ఒకసారి వేప ఆకులూ ,నిమ్మ ఆకులూ కలిపి పేస్టు చేసి తలకు పెట్టుకుని ఒక గంట తరువాత తల స్నానం చేయాలి.జుట్టు పట్టులాగా మెత్తగా వుంటుంది . అంతే కాదండోయి చుండ్రు కూడా పోతుంది .
౪.పార్లర్ కి వెళ్లి నెలకి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి. లేకపోతే మనము ఇంట్లో ఐన చేసుకొవచు.అదే పార్లర్ కి వెళితే మనము ప్రశాంతతని పొందుతాము .
౫.బాగా మంచి నీళ్లు తాగాలి.మాసాలాలు తినకూడదు.వెల్లుల్లి అస్సలు తినకూడదు ..ఎందుకంటె తలలో చుండ్రు వుంటే అస్సలు పోదు.
౬.బాగా వేడి నీళ్ళతో బాగా చల్ల నీళ్ళతో తల స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీళ్ళతో మాత్రమె తల స్నానం చేయాలి.
౭.దువ్వేనాను ౩ రోజులకు ఒకసారి సుబ్బరం గ కడుగుకోవాలి...ఎవరి దువ్వెన వారికీ వుంటే చాల మంచిది.అప్పుడు సగం బాధలు తీరుతాయి .
౮.ముఖ్యముగా మనసుకు ఎటువంటి బాధ కలిగించకూడదు ..అంటే మానసిక బాధలు వుండకూడదు.వుంటే మాత్రం చాల చాల జుట్టు వూదిపోతుంది.
**********************************************************************
నేను ఇవన్ని పాటిస్తాను మరి మీరు కూడా పాటించి మీ జుట్టుని బాగా పెంచుకుంటారు అనుకుంటున్నా***** ********************************************

5 కామెంట్‌లు: