5, ఫిబ్రవరి 2009, గురువారం

సబ్బుల కామెడీ (advertisements)...చెప్పుకోండి చూద్దాం??

ఏంటండీ బాబూ !చచ్చిపోతున్నాం ఈ సబ్బులతో.....ఏ సబ్బు అని వాడాలి? ఎన్ని సబ్బులని వాడాలి? ఐన కొంచెము ఐన అందం గా తయారు అవ్వట్లా!ప్చ్ ?????????నాకు తల పగిలి పోతోంది ఈ సబ్బుల గొడవలతో...


ఒకల్లేమో తులసి యొక్క ఆశీర్వాదం తిరిగి తిరిగి వస్తుంది అంటారు..అలా అన్నారు కదా మనకి ఆ తులసమ్మ ఆశీర్వాదం కన్నా ఇంకేమి కావాలి అని "హమాం " కొన్న ......అబ్బో సబ్బులు అయ్యాయి కాని......నాకైతే ఏమి రాలా........ ఏమండీ మీలో ఎవరికన్నా తులసమ్మ ఆశీర్వాదం లభిస్తే చెప్పండి..ప్లీసె. సబ్బు వాడకంలో ఏమన్నా లోపం వుందేమో తెలుసుకుంటా. లేకపోతే చిన్న పిల్లలకే పని చేస్తుందా ఆ సబ్బు!! ఏమో నేనొక అయోమయం దాన్నీ !!
హ్హ....మల్లి కొన్ని రోజులకి ఇంకొక ఆలోచన.అందరు నన్ను ఆంటీ అంటున్నారు..నాకు పిల్లలు కూడా లేరు పైగా.నాకు జస్ట్ 27 సంవత్సరాలే హమ్మ అని
ఏమి చేసానంటే "సంతూర్ "కొన్న.వాడాను వాడాను .......తీర చూద్దును కదా అందరు ఆంటీ అనే అంటున్నారు..కొంతమందికి ఐతే చెప్పుకున్న కూడా నేను సంతూర్ వాడాను అని..హబ్బే ఏమి లాభం లేదు.అది మమ్మిలకి అయితేనే పని చేస్తుందా అండి?మరి ....మరి... నేను అమ్మను కాలేదుగా ఇంక..ఏమో మీరన్న చెప్పండి కొంచెం వాడచో లేదో?నేనొక అయోమయం దాన్నీ!


అలా అలా మా అయన గారు తిట్లు మొదలెట్టారు. ఏమిటే నువ్వు రాను రాను మరి అందవికారం గ తయారవుతున్నావు అని.మల్లి ఏడ్చుకుంటూ ..ఏడ్చుకుంటూ . ...t.v చూస్తూ ఉంటే నా కళ్ళలో మెరుపు నాకే కనిపించింది.ఎందుకు అంటారా!!!!ఏంటండీ అర్థం కాలేదా"పియర్స్ " ....మల్లి నాలో ఆశ మొదలయింది....ఇంక ఆ సబ్బు కొన్న .సరే నేను ఎటు ఆ సబ్బు వాడుతున్న కదా అని రోజు మా వారు నిద్ర లేచే టైం కి చక్కగా పియర్స్ తో స్నానం చేసి అయన కళ్ళ ఎదురుగ కూర్చున్న....ఏమన్నా లక్ కలిసివస్తుందేమో మా అయన రోజు నా మొహం చూస్తే.హూఉ...తీరా ఏమి చెప్పమన్నారు! పాపమూ మా అయన కూడా పాపం పిచ్చి మొహంది బాధ పడుతుందేమో అని నా మొహమే చూసేవాళ్ళు.కాని ఏమి చేస్తామంది..ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కస్టపడి పని చేసి చేసి అనారోగ్యం తెచ్చుకున్నారు.ఇంక నాకు ఒళ్ళు మండి ఆఫీస్ మానేయమన్న.ఆ క్షణాన మా అయన అన్నా మాటకీ నా తల తిరిగి ఆ పియర్స్ సబ్బులన్ని చెత్త డబ్బాలో పడేసా ..మీకు అర్థమయ్యే వుంటుంది కదా అండి ఏమన్నారో? అప్పుడనిపించింది నిజంగా నేను అయోమయం దాన్నే అని.


మా ఆయనకి ఆరోగ్యం బాలేదు..ఎప్పుడు నా గురించే ఆలోచిస్తే ఎలా అని.....హమ్మ ఇప్పుడు నాకు సరి ఐన సబ్బు దొరికింది అని ఆనంద పడిపోయా ఎందుకు అంటారా మరి "లైఫ్బోయ్ వుంటే ఆరోగ్యం అక్కడ వుంటుంది" కదా అందుకని.మల్లి ఆలోచిన్చకున్దా లైఫ్బోయ్ కొన్న ....ఇంక మనకి డాక్టర్లతో పని లేదు అని...


కాని కొన్ని రోజులకి మా అయన ఆరోగ్యం పూర్తిగా పాడు అయ్యింది .నా కళ్లు డింగ్ మని తెరుచుకుని హాస్పిటల్కి వెళ్లి మందులు వేసుకుంటే కాని తగ్గాలా.మా ఆయనని ఇంత మోసం చేసిన సబ్బుని మురుగు కాలవలో పడేసి మూత పెట్ట.


మల్లి తెల్లవారి స్నానం చేయాలి అంటే సబ్బు కావాలి వేట మొదలెట్టా... ...."రెక్షొన కొందామంటే??అదేమో "ఇప్పుడు హమాం అభ్యమ్గా స్నానం అయ్యింది". ఛి వాడాము కదా వాదులే అనుకున్నా..హబ్బ హబ్బ మల్లి మల్లి నా కలల్లో 1,00,000 వోల్టుల మెరుపు .ఎందుకంటె చెప్పనా చెప్పనా....ఒక్క 4 నిమిషాలు నేను బంగారు లోకం లోకి అదేనండి కలలోకి వెల్ల....నా చుట్టూ డైరెక్టర్లు ,ప్రొడ్యూసర్లు చేరి నా సినిమాలో అంటే నా సినిమాలో హీరోయిన్ గా చేయమంటూ ఒకటే గొడవ...ఇంతలో షాపు వాడు వచ్చి ఏంటి మాడం ఏమి కావాలి అని అడిగితే కాని మల్లి ఈ లోకములోకి రాల నేను.వెంటనే నేను "6.?" సబ్బు ఇమ్మని అడిగా..అంతే వెంటనే ఇంటికి రాగానే నేను ముందు స్నానం చేసి కూర్చున్న.
మా అయన ఇంటికి రాగానే ఏమిటే ఇంత సంతోషముగా వున్నావ్?అని అడిగారు.నేను ఒక్క సేకాను కూడా ఆగకుండా నేను ఈ రోజు లక్షు కొన్ననండి అన్నా..ఆ వెంటనే పెద్ద లిస్టు వాషింగ్ మెషిన్ ,AC కావాలి అండి ఇంట్లో నేను రేపే షాపింగ్ చేయబోతున్న.అంతే కాదు అంది మనకి వంట మనిషి,పని మనిషి కూడా మాట్లాడుతున్న అన్నా...అయన దీనేకేదో పిచి ముదిరింది అనుకుని హాస్పిటల్కి తీసుకు వెళ్లారు..అక్కడ డాక్టర్ నన్ను ఒకటే ప్రశ్నలతో చంపారు అనుకోండి..తరువాత నాకు అర్థం అయింది ఓహో వీళ్ళకి తెలియదు ...ఏమండీ..."నేను cineethaarala సోపు" లక్సు "కొన్నాను .త్వరలో నేను సిని స్టార్ అవుతా కదా...అందుకని ఇవన్ని సమకూరుద్దాము మీరు ఇబ్బంది పడకుండా అన్నా.....కొన్ని రోజులు వాడి....... సినిమా చాన్సుల కోసం అన్ని చోట్లా తిరిగా...కొంత మంది ఐతే వాచ్ మాన్ ల చేత కొట్టించారు...


చూసారా ఎంత పని చేసిందో ఈ సబ్బు...ఇప్పటికి ఇంక బాగా అర్థం అయ్యింది నేను నిజంగానే అయోమయం దాన్ని అని!...


ఇంక ఛి ఛి అనుకోని షాపుకి వెళ్ళితే అక్కడ "మెదిమిక్ష్ కనిపించింది మనసు దాని మీదకు వెళ్ళింది..కాని రేపు నాకు పిల్లలు పుట్టాక నా కొడుకు,కూతురు,....."మమ్మల్ని ఎందుకు మోసం చేసావు అమ్మ "అంటే నేను ఏమి చెప్పాలి....కొనలేదు నేను ఆ సబ్బు!!!!.


తరువాత నాకు అసలు విసుకు వేసి ఛి ఏమిటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను.....మరీ సంస్కారం లేకుండా????అని ఆలోచించుకుని "సంస్కారవంతమైన సోపు" xxx" ని కొన్న. ఎందుకు అంటారా కనీసం ఆ సబ్బుతో అన్నా బట్టలు ఉతికి వేసుకుంటే నాకు సంస్కారం వస్తుంది....ఇలాంటి పిచ్చి ఆలోచనలను చేయను అని...కొన్నాళ్ళు ఆ సబ్బుని వాడా....సంస్కారం వచిందో రాలేదో తెలియదు కాని.చేతులు,నడుము నొప్పులు అయితే వచ్చాయి...


ఎంచక్కగా వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసుకోక....ఇదేమీ జబ్బు నాకు అని తిట్టుకుని...ఇహ సబ్బుల జోలికి వెల్లాల...!..


ఇప్పుడు నేను చాలా హ్యాపీ గ ఉన్నాను..మరి...............


ఆ తరువాత రక రకాల వాటి మీదకి మనసు వెళ్ళింది కాని చివరకి మా బామ్మ చెప్పిన సున్ని పిండి మంచిది అనుకుని సున్ని పిండి కొనుక్కుని వచ్చా.
మరి ఈ సున్ని పిండి నేను ఎన్ని కిలోలు వాడాలో ...అంటే కదా అండి మరి ఇన్ని సబ్బుల మూలంగా నా మొహం నాకే గుర్తు పత్తాలేకుండా అయ్యింది...మరి తిరిగి నా మొహం తెచుకోవాలి కదా అండి...


సరదా సరదా గ రాసానండి...........బావుందా అండి నా సబ్బుల బాగోతము





10 కామెంట్‌లు:

  1. ne sabbula bagotham bagundi sobha.. inthaki sunni pindi lone settle ayyav annamata :-)
    very funny :-))

    రిప్లయితొలగించండి
  2. భలే మంచి సబ్బూ, పసందైన సబ్బూ, సుగంధాలు పూచే మేటీ సబ్బు!
    బాగుందండీ

    రిప్లయితొలగించండి
  3. @santhi,
    thanku ......so much.
    @parimalam garu
    baaga navvu vachinda andi..ade naaku kaavaali...chaalaa thanks andi
    @kothapaali
    yemito kada andi ee sabbulu....chaalaa thanks andi.
    @naga prasad
    meeku kooda baga navvu vachindha andi...thanku so much andi

    రిప్లయితొలగించండి
  4. hi phani,
    chaala rojulaki oka comment andukunnanu...naa blog koodali lo undaha?meeru yela choodagaligau naa blogni...
    sabbula perlu raasthe baagundedi kada.

    anyway thanku somuch..

    రిప్లయితొలగించండి
  5. hammayya, mothaniki oka outlet(sunni pindi) choopinchi mugincharu ..leka pothe idi sada seeda post ayyundedi ...meelaga naku anni confusions levu ..ye subbu meeda expectation penchukoledy intha varaku ...asalu nenu ye sabbu vaduthano nake telidu ...just some genaral one available in market ..kani sunni pindi vadalani ee madhya balam ga anipistondi !


    btw, prathi tv advertisement ki mee vyakhyalu chala impressive ga unnayi...


    -Mauli

    రిప్లయితొలగించండి
  6. hammayya, mothaniki oka outlet(sunni pindi) choopinchi mugincharu ..leka pothe idi sada seeda post ayyundedi ...meelaga naku anni confusions levu ..ye subbu meeda expectation penchukoledy intha varaku ...asalu nenu ye sabbu vaduthano nake telidu ...just some genaral one available in market ..kani sunni pindi vadalani ee madhya balam ga anipistondi !


    btw, prathi tv advertisement ki mee vyakhyalu chala impressive ga unnayi...


    -Mauli

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి