2, ఫిబ్రవరి 2009, సోమవారం

సాదా సీదా రోగం (మానసిక ఆందోళన),పానిక్ అటాక్స్

నేను ఈ టాపిక్ ఎంచుకోవటానికి ఒక కారణం ఉంది అండి .అది తరువాత చెప్తాను.ముందు అస్సలు మానసిక ఆందోళన గురించి చెప్పాలంటే ఒక భయమ్కరమైన సాదా సీదా రోగం .మనకి బ్రెయిన్ లో కొన్ని రకాల రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయట. మనము మానసిక ఆందోళనకి,వతిడి కి కారణం ఒక రకమైన రసాయనాలు విడుదల అవ్వటమే త.మనము ఎక్కువ వతిడికి,ఆందోళనకి,భయానికి ,,మొదలైన వాటికి మనలో అడ్రినల్ అనే హార్మోను విడుదల అవుతుంది.దీని మూలంగా పానిక్ అటాక్స్ వస్తాయి..
కొంతం మంది కొంత లెవెల్ వరకు వత్తిడి తట్టుకోగలరు..ఈ తట్టుకోవటం అనేది అందరికి ఒకటేలాగా వుండదు. అందు వల కొంత మంది తట్టుకోగలరు...నేను చెప్పేది తట్టుకోలేని వాళ్ల గురించి అండి.
ప్రతి మనిషి ఆలోచనలు ఒకరకం గ వుండవు..అస్సలు నిజంగా చెప్పాలి అంతే ఎక్కువగా మనుషుల మూలంగానే ఇలాంటి వత్తిడులు ,ఆందోళనలు వస్తాయి....చాలా తక్కువ మందికి భయమ్కరమైన సంఘటనలని చూసి వస్తాయి..ఏది ఏమైనా ప్రతి మనిషి వీటి అన్నిటి నుంచి చాల చాల చాల దూరంగా వుండాలి.ప్లీజ్ అందరు టెన్షన్స్ నుంచి దూరంగా వుండండి.లేదంటే తట్టుకోవటం చాల కష్టము.
అ. తీవ్రమైన వత్తిడికి గురి అయ్యి తట్టుకోలేని స్థితి లో చాలా కాలం అలాంటి జీవితం గడిపితే ఈ పానిక్ అటాక్స్ వస్తాయి..ఇదే నండి చాలా బాదాకరమిన విషయం.
ఆ.అలా అని అందరికి కాదు కొంతమందికి మాత్రమె.అలాంటి వాళ్ల కోసం ముఖ్యమ్గా నేను రాస్తున్నాను. నిజంగా ఈ పానిక్ అటాక్స్ వస్తే నిజంగా దారుణంగా వుంటుంది అండి పరిస్థితి..మన ఇంట్లో ఉండే మనుషుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది..ఆ పేషెంట్ యొక్క ఆరోగ్యం.ఇది వచ్చిన పేషెంట్ త్వరగా కోలుకుంతాడ లేదా అనేది నన్నడిగితే అది కేవలం ఇంట్లో మనుషుల మీద,స్నేహితుల మీద మాత్రమె ఆధారపడి ఉంటుంది.
సి .అస్సలు ముందుగ దీని లక్షణాలు ఎలా వుంటాయి అంటే చేతులు,కాళ్ళలో వణుకు వస్తుంది,తలలో అంత ఒక విధమైన తిరుగుడు లాగా వుంటుంది,సరిగా కళ్ళతో చూడలేము అంటే మసకగా వున్నట్టు,కళ్లు మూతలు పడుతున్నట్టు ఉంటుంది,కొంతమందికి బి.పి పెరిగిపోతుంది,చుట్టుపక్కల ఏమి జరుగుతుందో గ్రహించే స్థితిలో ఉండలేము,గుండె వేగంగా కొట్టుకుంటుంది ,కాళ్ళు,చేతులు మన స్వాధీనంలో ఉన్నట్టు ఉండవు,నిల్చుంటే పడిపోతామేమో అనిపిస్తుంది,ఊపరి తీసుకోగాలుగుతున్నామా లేదా అని మనకే అనుమానం వస్తుంది,ఇంక అయిపోయింది చచ్చిపోతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది,నీరసం అయిపోతుంది ఒళ్ళు అంత,ఒక్క సరి మైండ్ అంత పిచ్చిగా అయిపోతుంది,ఏమి తినలేము, గొంతు మింగుడుపడదు, ఒక్క మంచి నీళ్లు మాత్రమె తాగాగలము , అంతే ద్రావకాలు అన్నమాట ..మొదలైనవి వుంటాయి అండి.
డి. ఈ విధముగా అనిపించేది ఒక్క 5 నుంచి 10 నిమిషాలు మాత్రమె. తరువాత మల్లి మామూలు స్థితికి వస్తాము.కాని తరువాత చాల నీరసంగా వుంటుంది.మొదటగా ఈ స్థితి ఎదుర్కొంటున్నప్పుడు docter ని తప్పనిసరిగా కలవాలి...ఆలస్యం చేయకూడదు..మందులు వాడాలి.నేను చెప్పేది ఇక్కడ ముఖ్యముగా మందులు వాడాలి కాని ఆ మందులు ఎక్కువరోజులు వాడకుండా వుండేలా చూసుకోవాలి.కేవలం ఆ మందుల మీద ఆధారపడకుండా మెల్లి మెల్లిగా తగ్గించుకునే ప్రయత్నం మనము చేయాలి.


ఏమి చేయాలి అనేవి డాక్టర్ సలహా ఇస్తారు.తప్పనిసరిగా కవున్సేలింగ్ తీసుకోవాలి.
యోగ కాని,మేదితషన్ కాని తప్పకుండ చేయాలి,అది కూడా డాక్టర్స్ సలహాలతోనే మెల్లిగా ప్రారంభించాలి.ఎందుకంటె ఆ టైములో గుండె కొట్టుకునే వేగం చాల అధికంగా వుంటుంది. అందువలన మెల్లిగా ప్రారంభించాలి..
ఎ.ఇంట్లో కూడా అందరు సహకరించాలి.దయచేసి ఇంట్లో అందరు ఆ మనిషి ని త్వరగా కోలుకునే టందుకు సహాయపడాలి.అంతే కాని ఇంక ఆ రోగాన్ని పెంచే పనులు చేయకూడదు.ప్రశాంతమిన వాతావరణం నెలకొల్పాలి.ఎప్పటికప్పుడు నీకేమి కాదు అనే ధైర్యాన్ని ఇవ్వాలి.జాగ్రత్త గా చూసుకోవాలి.ఇంట్లో గొడవలు ఏమి ఆ వ్యక్తి ముందు పెట్టదు.నెమ్మది నెమ్మదిగా ఆ వ్యక్తి చేత కూడా ఇంట్లో పనులు చేయించనీయాలి.ఎంత వరకు చేయగలిగితే అంతవరకు.అంతెయ్ కాదండి ఒక్కొక్కసారి కొంచెం కసురుకోవాలి .వాళ్ల reaction ఎలా వుందో గమనించాలి.దానిని బట్టి కసురుకోవతంలో తగ్గించటం పెంచటం చేస్తూ ఉండాలి.మెల్లిగా బయటి ప్రపంచంలోకి తీసుకురావాలి.పార్కులకి,గుళ్ళకి ల తిప్పుతూ ఉండాలి.బయట ట్రాఫిక్ ని చూసి ఆ హారన్ శబ్దాలు వింటే మల్లి కొంచెం మొదలు అవ్తుంది టెన్షన్.. కాని అలానే బయట తిప్పాలి.
ఈ . మనము ఎంత చేయూత నందిస్తే వాళ్లు అంత త్వరగా కోలుకుంటారు.దీనికి సంధించిన మందులు మెల్లి మెల్లి గ వాడటం తగ్గిస్తూ సాధ్యమైన అంత త్వరగా మానేయాలి.homeopathy ఐతే ఇంక మంచిది అండి.అల్లోపతి మందులకి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాల ఉంటాయి..ముఖ్యముగా పొట్ట పాడవుతుంది.గాస్ ట్రబుల్ వస్తుంది...
వు.ఏమిటండి దీని గురించి ఇంత చర్చ అవసరమా! అనిపిస్తోందా.అవసరమేనండి.ఎందుకంటె నేను స్వయమ్గా ఈ బాధ అనుభవించాను....మొదటిలో నాకు అసలు ఇలాంటి రోగం ఒకటి ఉంది అని తెలియదు.నాకేమి అయింది అని నాకు తెలుసుకోవతానికే దగ్గర దగ్గర 8 నెలలు పట్టింది.ఆ తరువాత ఒక అవగాహనకి వచ్చి psycriatist ని కలిసాను.తరువాత ఇంక మందులు.దాని మూలంగా సైడ్ ఎఫ్ఫెక్ట్స్.....ఒకానొక రోజున నా mind లో ఏమిటిది homeopathy ట్రై చేద్దామా అనిపించి మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగా అయన ఎస్ అని చెప్తే నేను వెంటనే homeopathy లోకి దిగ...నా అదృష్టము ఏమిటంటే..నా డాక్టర్ ఆలోచనలకి అనుగుణంగా చక్కగా మందు ఇస్తారు.ఆయనే నాకు ఇచిన మంచి సలహా కోన్స్లింగ్.కోన్స్లింగ్ తీసుకున్నాక నాకు చాల విషయాలు.తెలిసాయి.
అప్పుడు నాకు అనిపించింది అండి..నాకు ఈ రోగం రావటం ఒక విధంగా మంచిది అని..లేకపోతే నాకు బయట ప్రపంచం తెలిసేది కాదు.నేను ఏదో ఇంట్లో ఇంట్లో పెరిగా .....ఒక్క సరిగా బయట వేరే ఇంట్లోకి వచ్చి ఉన్నాను అంటే అది 4 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యి రావటమే...2 సంవత్సరాలు తరువాత నాకు ఈ రోగం వచ్చింది.
కారణాలు ఏమైనా రోగం ఐతే వచ్చింది.అది ఇప్పటికి కూడా పూర్తిగా పోలేదు అండి.నన్నుgastric ట్రబుల్ రూపములో వెంటాడుతోంది.అంతెయ్ కాదు అప్పుడప్పుడు లైట్ గ పానిక్ అటాక్స్ కూడా వస్తాయి.కాని ఇప్పుడు నా అంతటి నేను ఒక్కదాన్నే కేర్ తీసుకోగలను.నాకు ఎవ్వరి అవసరము అక్కరలేదు.
కాని కావాల్సిన టైములో నాకు దొరకలేదు. దీని మూలంగా నాకు పూర్తిగా బయటి ప్రపంచం,మనుషులలోని రకాలు అన్ని తెలిసిపోయాయి.అంత త్వరగా నేను జీర్నిచుకోలేకపోతున్నాను..హమ్మో కుల్లులు,కుట్ట్రాలు,పగలు,ప్రతీకారాలు,దీనికి తోడు టీవీ సేరిఎల్స్ చూసి జనాలు వాటిని అనుసరించడం..అయ్యా బాబోయి...దారుణం దారుణం.అంతే నేను ఇంతకన్నా ఎక్కువగా చెప్పేది ఏమి లేదు.
నేను అనుభవించాను కాబట్టి అందరికి నేను చెప్తున్నా.ఒక విధముగా ఈ బ్లాగ్ లోకంలోకి వచ్చింది కూడా నా రోగం నుంచి నేను బయటపడటం కోసమే...
నా స్నేహితురాలు " శాంతి" నాకు ఇది నేర్పించింది.ఇలా బ్లాగ్లు ఉంటాయి చదువు,టైం పాస్ అవుతుంది,అన్ని తెలుస్తాయి అని,అంతెయ్ కాదు అండి తను నాకు చాల విషయల్లు చెప్తుంది,తన మూలంగా నేను చాలా నేర్చుకున్నాను.తనకి దీని ద్వారానే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను....


అసలు ఈ రోగం తేచుకోకండానే ఉంటే పోలా.
అందుకేనండి నేను నొక్కి చెప్పేది ఏమిటంటే దయచేసి ఎవరు టెన్షన్ పడద్దు.మనము ప్రయత్నము మాత్రమె చేయాలి టెన్షన్ పడద్దు.మనము నీతిగా నిజాయతీగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోవక్కరలేదు.ఇంకొకళ్ళకి సంజాయిషీ ఇవ్వక్కరలేదు మనము చేసే పని ,మంచిది అయినప్పుడు.మన గమ్యం సరి అయినది అయినప్పుడే ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాలి.మనము నడిచే దారి సరి అయినది అయినపుడే ఆ దారిలో ముళ్ళు ఉంటాయి అనే సామెత ఉంది.
నేను చివరిగా నా గురించి ఆలోచించుకుని .....నేను ఆరోగ్యమ్గా వుంటేనే వేరొకరికి సహాయ పడగలను.అని భావించి నేను ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను.


*****దయచేసి అందరు ప్రశాంతమైన జీవితం గడపండి********

8 కామెంట్‌లు:

  1. అంజలి గారు, పానిక్ అటాక్స్ గురించి నాకు బాగా తెలిసిన వ్యక్తి కోసం చాలా స్టడీ చేశాను. ఆ సిట్యుయేషన్ ని భరించడం ఎంత కష్టమో గమనించాను. నిజంగా హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అన్నంత ఫీల్ ని కలుగజేసే పానిక్ అటాక్స్ గురించి మీ అనుభవంతో రాసినందుకు ధన్యవాదాలు. ఇది ఎందరికో ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించండి
  2. మీ అనుభవాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    Thanks for sharing your experiences and also your concern for others to have a Healthy living.

    రిప్లయితొలగించండి
  3. sreedhar garu,
    nijamga andi heart attack ane anukuntamu...oopiri aadadhu..chala thanks andi.
    first mee nunchi nenu modati post andukovatam chaalaa anandamga vundhi.actual ga aa timelo nenu kuda vethikanu ee panic attacks ni face chesina vaallu yevaranna vunnara ani.but naaku yevaru dorakaledu.meeku baaga thelisina vyakthini meeru yeppudu santhosha peduthu undandi..chala help chesthundhi ee happiness anedi.annatlu vaallaki thagginadha andi.
    lekapothe neu vaaritho maatlaadataaniki readyga vunnanu..nenu share chesukuntanu..vaalla baadhalani.
    @umasankar garu...
    meeku kuda naa dhanyavaadamulu...meeku ilanti vaallu yevaranna mee life lo thagilithe vaallani happyga vunche prayatnam cheyandi.nuvvu yemina cheyagalav ane dhiryaanni vaallaki ivvandi.
    nenu cheppedi nijamenandi maamulu vaallakanna ee situation ni face chesina vaallu lifelo chaalaa happyga vuntaaru.yendukante hammo chachipothanemo ane bhayam poorthiga pothundhi.

    రిప్లయితొలగించండి
  4. Hi dear, today I come to your blog unexpectedly ...and this is 3rd post i read ...thought of asking if you are part of any group (like orkut) to add u to my list after reading you sabbu post ..:) ....and after reading this i want to get in touch with you !!!

    -Mauli

    రిప్లయితొలగించండి
  5. hi madam naku kuda meeru cheppina vidhamga vuntundhi ante kaallu chethulu vanakadam gunde dhada kallu thiragadam e roje last annattu vuntundhi oka rendu nelala tharvatha thaggi malli alage vasthundhi nakemo bayam vesthundhi nenu andharini adigithe andharu vichithramga chusthunnaru emi cheyyali test anni cheyinchanu anni normal kani idhi emiti meeru cheppinadhanni chadivanu meri ebayam povalante Ala cheppandi emanna alochincha gane idhi modhalav thundhi dheeni valla emanna problem vuntundha

    రిప్లయితొలగించండి
  6. hi madam naku kuda meeru cheppina vidhamga vuntundhi ante kaallu chethulu vanakadam gunde dhada kallu thiragadam e roje last annattu vuntundhi oka rendu nelala tharvatha thaggi malli alage vasthundhi nakemo bayam vesthundhi nenu andharini adigithe andharu vichithramga chusthunnaru emi cheyyali test anni cheyinchanu anni normal kani idhi emiti meeru cheppinadhanni chadivanu meri ebayam povalante Ala cheppandi emanna alochincha gane idhi modhalav thundhi dheeni valla emanna problem vuntundha

    రిప్లయితొలగించండి
  7. panic attacksvasthu untayi....pothu untayi.
    alochinchadhu.manam chachipothamemo ani bhayam.yetu chavaka thappadhu.so aa bhayam vadleyandi.full busy ga undandi.mee meeda adarapaddavallu chala mandhi undi untaru.vallani choosukuntu..meeku meeru yedhanna manchi pani sadhinchali ani pettukuni....each and every minute dani gurinchi alochinchandi.

    రిప్లయితొలగించండి
  8. naresh garu,dont worry.bayata prapamchamlo manakanna severe health problems unnavallu chala mandhi unnaru.vallakanna manam 100% better.

    రిప్లయితొలగించండి