27, సెప్టెంబర్ 2012, గురువారం

ఏమిటో

ఏమిటో ఈ జీవితం?
ఈ జీవిత పయనంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము.
కొందరు మన జీవితంలో భాగం అవుతారు.
కొందరితో కొన్ని నిమిషాలు 
కొందరితో గంటలు 
కొందరితో రోజులు 
కొందరితో నెలలు 
కొందరితో సంవత్సరాలు 
కొందరితో చనిపోయేవరకు కలిసి ఉంటాము.
కాని అయ్యో నేను ఒంటరి వాడిని/దానిని అన్న భావన కనీసం ఒక్కసారన్న వస్తుంది.
ఆ భావన కూడా కొంతమందికి నిముషాలు,నెలలు,రోజులు,సంవత్సరాలు చివరకు చనిపోఎవరకు ఉంటుంది.
ఎన్ని రకాల మనస్తత్వాలు చూస్తూ ఉంటామో?
ఒకసారి ఇవన్ని కూర్చుని ఆలోచిస్తే వింతగా ఉంటుంది.

ఒక విషయం మాత్రం అర్థం అవుతూ ఉంటుంది.ఒంటరి తనం చాల కష్టం.మన చుట్టూ ఇంతమంది మనుషులున్న మన బాధ పంచుకునే వ్యక్తి లేకపోతే ఎంత నరకం గ ఉంటుందో కదా!

ప్రతి మనిషికి  కష్ట  సుఖాల్ని పంచుకునే వ్యక్తి తప్పకుండ  వుండాలి.
జీవితం చాల చిన్నది.
కోప తాపాలు ,ఈ గో  లు ,అనుమానాలు పెట్టుకోకుండా ఆనందంగా జీవిస్తే ఏ బాధ ఉండదు.
ప్రశాంత తను  మించినది మరొకటిలేదు అని నా ఉద్దేశ్యం...


ఉంటాను మీ 
అంజలి...


31, జులై 2012, మంగళవారం

విద్య-విధానము


మా  అన్న  కొడుకు  అత్త  ఇదిగో నాకు సైబర్ ఒలమ్పిఆడ్  లో మంచి రాంక్ వచ్చింది చూడు అంటే    నవ్వాలో ఏడవాలో  తెలియని  స్థితి.......

ఒకడు నాన్న చుట్టాలు ఎప్పుడు వెళ్లి పోతారు? నేను చదువుకోవాలి. టైం వేస్ట్ అవుతోంది అంటే ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితి.

నానమ్మ,తాత  ఫోన్ చేస్తే మేము చదువుకుంటున్నాం అని మనవాళ్ళు అంటేను.....పోనిలే కొడుకు కోడలితో మాట్లాడదమంటె  మేము పిల్లలకి చదువు చెపుతున్నాము....తరువాత మాట్లాడతం అంటే వాళ్ళు కోల్పోయే ఆనందం...

ఈ రోజు నేను పూజ చేసుకుంటున్నాను ఆదివారమే కదా అని పేరంటానికి వదినలని పిలిస్తే అమ్మో ఈ రోజు ఆదివారమైన రేపు సోమవారం అన్ని ప్రిపే ర్  చేసి పెట్టుకోవాలి .ఈ రోజు అంత మాకు చాల పని ఉంది.మల్లి పొద్దున్నే లేవాలి అని చెప్తారు.

పోనీ సమ్మర్ హలిడే స్  కదా కొన్ని రోజులు పిల్లల్ని తీసుకురండి అంటే సమ్మర్ క్యాంపు  అని,స్విమ్మింగ్ అని,స్కేటింగ్ అని చెప్పాలంటే నాకు విసుకు వస్తోంది.
అసలు వీళ్ళు పిల్లల యంత్రాల? బుర్రలు అయితే పూర్తిగా పాడవుతాయి అని అర్థం అవుతోంది.పిచ్చి వాళ్ళు అయిన ఆశ్చర్యపోనక్కరలేదు.

హ...మర్చిపోయ మొన్న మా ఆడపడుచు వచ్చింది.హాయిగా తల స్నానం చేసి తను చెప్పిన మాట ఏమిటంటే...వదిన ఇంటర్ అంత అసలు తల స్నానం చేయటానికి టైం ఉండేది కాదు పొద్దున్న 6 కి బయలుదేరితే ఇంటికి వచెటప్పటికి రాత్రి 9 అయ్యేది.పడుకుని మల్లి పొద్దున్న వెళ్ళాలి.అని.నాకు మతిపోయింది.

పొద్దున్న 5:30 కి లేచి రెడీ అయ్యి గబగాబగా అన్ని పనులు చేసుకుని 7:30కాళ్ళ బస్సు ఎక్కితే స్కూల్ లో తిప్పలు పది ఇంటి వచెటప్పటికి 6:00 అదే ట్రాఫ్ఫిక్ ఉంటె ఇంకో గంట.

ఏమి తింటున్నారో.ఏమిటో పిల్లలకు బలము ఉండట్లేదు.ఇప్పటి  కూరలు,సరుకులే సరిగా పండక..హైబ్రిడ్..ని ఏవేవో చేసి అమ్ముతున్నారు.ఆ పైన పిల్లలు తిండి తినే టైం లేదు...అసలు పెద్ద అయ్యాక వీళ్ళకి బలం ఉంటుందా.ఆడపిల్లల పరిస్థితి అయితే మరి అన్యాయం...

దయచేసి పెద్దలందరూ ఒకసారి ఆలోచించండి ..ఈ విద్య-విదానంలో ఏమన్నా మార్పు తేవచేమో......చేతులారా మన,మన పిల్లల జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం .ఆటలు లేవు..మైండు కి తగినంత అక్తివితి లేదు.

ఇంకా చాల బాధలు నష్టాలు ఉన్నాయి.ఉపయోగం నాకు కనిపించట్ల....పోటి  తత్వం పెరుగుతోంది.అది ఆరోగ్యకరమినది కాదు..ఎంత రాసిన రాస్తూనే ఉంటాను.

ఉంటాను.
మీ అంజలి....

25, ఏప్రిల్ 2012, బుధవారం

EAMCET EXAMS

అందరికి ధన్యవాదములు...


" ఎంసెట్ " పరీక్ష వ్రాసేవరందరికి ఒక శుభవార్త అండి. ఏమిటంటే మా శ్రీ వారు  మరియు కొంతమంది సభ్యులు కలిసి

ఒక ప్రాజెక్ట్ చేసారు .చక్కగ  నెట్ లో ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ prepare  అవ్వచ్చు మరియు online లో ఎగ్జామ్స్

వ్రాయచ్చు.

దీని గురించి తెలుసుకోవాలంటే  "www.practise2success .com "  ను ఒక సరి visit  చేయండి.

మీకు తెలిసిన వారికి తెలియ చేయండి.

దీని వలన మీకు చాల లాభములు ఉంటాయి ...చాల చాల experienced lecturers చేత వ్రాయిన్చాబడి నవి.

అందువలన మీకు ఇది మంచి అవకాసం.

మీకు వివరములు కావాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు:

1 . 9951079444 

2 . 9553295677 


మీరు ఈ numbers  కి ఫోన్  చేసి వివరములు తెలుసుకోండి.

ఉంటాను... అల్ ది బెస్ట్ ...ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ .

మీ
అంజలి.

18, అక్టోబర్ 2011, మంగళవారం

అద్భుతమైన మన జాతీయ పక్షి

అద్భుతమైన  మన జాతీయ పక్షి .......ఈ విధంగా ఎప్పుడు చూసి ఉండరు చాల మంది..ఇంత  అందమా ...........ఆ దేవుడి సృష్టి ని చాల మెచ్చుకోవాలి....
ఇంకేమి చెప్పటానికి మాటలు రావట్లేదు...మీరే చూసి ఎలా ఉందో చెప్పండి.

2, ఏప్రిల్ 2011, శనివారం

11, మార్చి 2011, శుక్రవారం

మనమంతా ఒక్కటే

మనమంతా ఒక్కటే  అని అందరి నోట ఎప్పుడు విన్టానో.
ఉదాహరణకి హాస్పిటల్ తీసుకుంటే.........అక్కడ పని చేసే నర్సులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు సేవ చేస్తున్నారు.మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు?
వాళ్లకి మనుషులు అంత ఒకటే.
ఒక డాక్టర్ నేను పాలనా వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తాను అని కూర్చుంటే ఎంతమంది చనిపొతారో కదా....
కాని వాళ్ళకి కులాలు,మతాలు,ముఖ్యంగా నా దేశం అనేది కూడా ఉండదు.ఎవరు వచ్చిన వాళ్లకి ట్రీట్మెంట్ ఇస్తారు.ఎవరైనా సరే .....రోగం వచ్చిన వాళ్ళు చికిత్స కోసం ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు వాళ్ళ స్తోమతను పట్టి.
మనకి ప్రాణం పోసేది డాక్టర్లు.మనము బ్రతికి ఉంటేనే మనకు కావాల్సిన  హక్కులు సాధించుకోగలం..మనమే లేకపోతే......?
నాకు నా ప్రాంతం డాక్టరు చికిత్స చేయాలి అని ఎవరు ఉండరు.
అల్లాగే డాక్టర్ల దగ్గర అందరు సమానమే.నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవారు డాక్టర్లు.అలాంటి వారికే తేడాలు లేనపుడు మనకు ఎందుకు తేడాలు.
మనము అందరమూ ఒకటే. బతికినన్ని రోజులు హాయిగా బతుకుదాం.
ఉంటాను...మీ అంజలి.

10, మార్చి 2011, గురువారం

మనుషులా రాక్షశులా (పిచ్చి జనం ,పిచ్చి గోల )

అసలు రాజకీయాలు అంటేనే నాకు ఇష్టం లేదు.కాని ఈ రోజు మిలియన్ మార్చ్ అంటూ వాళ్ళు చేసిన రచ్చ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది.నా గుండె తట్టుకోలేకపోతోంది.టాంక్ బండు మీద ఉన్న విగ్రహాలు వాళ్ళని ఏమి చేసాయి.
ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఛి ...
గాంధీ గారు మనకు మన భారత దేశాన్ని ఇచ్చారు.దానిలో మల్లి భాగాలు.
బాబోయ్ నాయకులని చూస్తుంటే విసుకు వేస్తోంది. అసలు విద్యార్థులకి ...ఇలాంటి పనులకి లింక్ ఏమిటో నాకు అర్థం కాదు.చదువుకుని దేశాన్ని ఎలా అభివ్రుది చెయాల అని కాకుండా ఎలా ముక్కలు చెయాల అని ఆలోచిస్తున్నారు.
వీటికన్నా కూడా ఈ రోజు విగ్రహాలను నాశనం చేయటం అనేది చాల బాధపెడుతున్న విషయం.ఏనాటి నుంచో చక్కగా అందంగా ఉన్న వాటిని పాడుచేసారు.ఎక్కడో విదేశాల నుంచి వచ్చి వీటిని చూసి అందరు మెచ్చుకుని వెళతారు.ఇక్కడే ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేసారు..అసలు కొంచెం కూడా మానవత్వం,మంచి హృదయం అనేది లేదనుకుంట వాళ్లకి.
నాకు చాల సిగ్గుగా ఉంది.ఛి.ఛి. .........
ఇలాంటి మనుషుల మధ్యనే బతకాలి. తప్పదు కదా.
ఉంటాను....బాధతో............మీ అంజలి.