9, సెప్టెంబర్ 2013, సోమవారం

VINAYAKUDU-----21

నేను ఎకవిమ్సతి పత్రాల గురించి రాసాను కదా అంది...ఆ రోజు నుంచి అసలు 21 కి వినాయకుడికి సంభంధం ఏమిటి?21 పత్రాలె ఎందుకు వాడుతున్నారు ఇలా దౌబ్త్స్ మొదలయ్యాయి......ఆలోచిస్తూ ఆలోచిస్తూ కలంగాడుపుతూ ఉంటే....నిన్న రాత్రి ఏదో బుక్ చదువుతూ ఉన్నా...అందులో ఖచితంగా నా ఆలోచనలకి జవాబు ఉంది.
నాకు చాల ఆశ్చర్యం వేసింది.పైగా అది వినాయకుడికి సంభందించింది కూడా కాదు......
సర్లెండి...ఏమో కాని.....మీతో కూడా ఆ వివరాలు షేర్ చేసుకుంట....ఓకే
పరమ శివుని అనుగ్రహంతో శ్రీ గణేశుడు ఇంక ఇరవై రూపాలు ధరించాదుట..
అంటే మొత్తం 21 మంది అన్నమాట .
ఇంక పార్వతి దేవి ఎనలేని ఆనందం తో ఆ ౨౧ మందికి ౨౧ పేర్లను పెట్టి చాల ఆనందంగా చుసుకుంతోందిత.
ఇంక వాళ్ళకి బ్రహ్మ మానస పుత్రుడు ,ఉప బ్రహ్మ ఐన విశ్వ దర్శి కుమార్తెలు 21 మందిని ఇచ్చి వివాహం చేసారుట.
ఈ ౨౧ మంది గణపతులను తలచుకుంటే అన్ని శుభాలు జరుగుతాయట.
వారి పేర్లు...
1.శ్రీ గణేశుడు-జయ లక్ష్మి :--- లక్ష్మి గణపతి అని పిలుస్తారు..సర్వ కార్యాలు జయప్రదం చేస్తాడు.
2.సిద్ది గణపతి -సిద్ది బుద్ది లక్ష్మి :-ఈయన సిది బుధి ప్రదాయకుడు.
౩.చింతా మని గణపతి - విజయ లక్ష్మి :-ఈయన విజయ ప్రదాత.
4.ఏక దంత గణపతి-సిద్ది లక్ష్మి:-సర్వ సిద్ధులు అనుగ్రహిస్తాడు.
5.వక్ర తుండ గణపతి-నవ రత్న లక్ష్మి :- నవ విధులు అనుగ్రహిస్తాడు.
6.లక్ష్మి ప్రద గణపతి-వీర లక్ష్మి :-వీరత్వం వ్రిద్ది కావిస్తడు.
7.నింబ గణపతి-బుద్ది లక్ష్మి:-బుద్ది కుశలత అనుగ్రహిస్తాడు.
8.లంబోదర గణపతి-సిద్ధ విద్యదేవి:- సర్వ విద్య ప్రదాత.
9.రునవిమోచన గణపతి-సౌభాగ్య లక్ష్మి:-రుణ విమోచన కారకుడు.
10.శుక్ల గణపతి-బుద్ది లక్ష్మి:-సుబుద్ధిని అనుగ్రహించగలదు
11.ధూమ్ర గణపతి-సిది లక్ష్మి:-సర్వ సిది ప్రదాత.
12.రక్త వర్ణ గణపతి-పద్మా దేవి:-గ్రహ దోష నివారకుడు.
13.సువర్ణ గణపతి-రజితా దేవి:- సువర్ణ రజత ప్రదాత.
14.విగ్గ్న గణపతి-ప్రజా దేవి:-సర్వ విగ్గ్న హరుడు.
15.నిర్విగ్న గణపతి-అతి ప్రజ్ఞా దేవి-నిర్విగ్నంగా కార్య సమాప్తి కావించ సమర్ధుడు.
16.వికట గణపతి-జ్ఞాన దేవి:- జ్ఞాన ప్రదాత.
17.బాల చంద్ర గణపతి-చంద్రముఖి:-ఆనంద ప్రదుడు.
18.సర్వాంబర గణపతి-సంహార దేవి:-శత్రు సంహార కారకుడు.
19.గణాధిపతి-శాంతా దేవి:-శాంతి ప్రదుడు.
20.భద్ర గణపతి-లోకమాత దేవి:-శాంతి భద్రతల సంరక్షకుడు.
21.చివరిగా మనమందరం వర sidhdhi  వినాయకుడు అని పిలుచుకుంటాం...
ఇది అంది విషయం...అందువలన అనుకుంట ౨౧ అనే సంఖ్యా వచ్చింది...
******ఏమన్నా తప్పుగా వున్నా యెడల క్షమించగలరు..నాకు చెప్పండి సరి చేసుకుంటాను...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి