18, ఏప్రిల్ 2013, గురువారం

సత్య సాయి నిగామగమం చాగంటి గారు

అందరికి నమస్కారములు,

నేను నాలుగు రోజులుగా "సత్య సాయి నిగామగమం " శ్రీ నగర్ కాలనీ  లో జరుగుతున్న "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు " గారు చెప్తున్నా "శ్రీ సుబ్రహమన్యే శ్వర  స్వామి వారి వైభవం " వినటానికి వెలుతున్నాను . మనసుకు హాయిగా ఉన్ధి.ఇన్థ అదృష్టం కలగటం నా జీవితంలో రెండవ సారి. మొదటిది ఇషా సద్గురు గారి స్పీచ్ వినటం . రెండవది చాగంటి గారి ప్రవచనాలు వినటం .   అది కూడా కుమారస్వామి వైభవమ్. 
చాల అద్భుతం గ వున్నయి. 
నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే  మంగళవారం షష్టి తిథి రోజు ప్రసాదం పెట్టారు .  ఆ రోజు తోపులాట అంత ఇంత కాదు .   చాగంటి గారి ప్రవచనాలు వింటున్న ,ఏ మాత్రం విచక్షణ లేకుండా తోసుకుంటూ వెళుతున్నారు ప్రసాదం కోసం .చగన్తి గారు చెప్తున్నా వినిపించుకొవట్లెదు . 
మల్లి ఈ రోజు  గురువారం పసుపు,కుంకుమ , గాజులు ఇస్తారు లైన్ లో వెళ్ళండి అంటే  తోపులాట . కనీసం ముసలి వాళ్ళు ఉన్నారు అని కూడా చూసుకోకుండా అల తోసుకుంటున్నారు . అమ్మవరివి మనకి ప్రసాదం గ ఇవ్వాల్సిన గాజులు ఎన్ని పగిలిపోయయో తెలుసా తోపులాట మూలంగా ? మాకు దక్క లేదు . 
చాల బాధగా ఉంది . దయచేసి ఈ బ్లాగ్ చదివే వాళ్ళు ప్రసాదం పెట్టె చోట ఎక్కడ తోసుకోవదు అని మనవి . మనము క్యూ  పద్ధతి పాటిస్తే మన వెనుక వాళ్ళు కూడా పాటిస్తారు . 

రేపు కళ్యాణము,అభిషేకము నాకు చాల భయము, బాధగా ఉంది .. 


అసలు ఇవన్ని చూసి చాగంటి గారు మళ్ళి  హైదరాబాదు వస్తార ప్రవచనాలు చెప్పటానికి? దయ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు . మళ్ళి  అయన హైదరాబాద్ వచ్చి ప్రవచాలు చెప్పేట ట్టు గా ప్రవర్తిద్దాము . 

తప్పు అనుకుంటే క్షమించండి . 
మీ అంజలి .... 


4 కామెంట్‌లు:

  1. వింటారు తప్పించి ఆచరణలోకి తేరు, మన దౌర్భాగ్యం

    రిప్లయితొలగించండి
  2. మీ బాధ అర్థమయింది.
    చాలా విచారించ వలసిన సంగతి.
    తిరుపతివెంకన్నను చూడాటానికి బ్లాకులో టిక్కట్లు కొనుక్కునే‌ జాతి జనుల సంస్కారం గురించి మనం యెంత బాధపడి యేమి లాభం?
    మన జనాన్ని భగవంతుడే మార్చాలి.

    రిప్లయితొలగించండి
  3. కడు విచారకరము. అసలు మూలాన్ని మరిచి పోతున్నారందరు. మనల్ని డిసిప్లిన్ లో పెట్టాటానికే భక్తి అనేది. అది మర్చిపోయి స్వార్ధ చింతనతో ప్రవర్తిస్తున్నారు .

    రిప్లయితొలగించండి